సారీ..పూరి గారి పేరు మ‌రిచా!

Mahesh Babu thanks Puri Jagannadh for Pokiri
Wednesday, May 1, 2019 - 23:30

"మ‌హ‌ర్షి"...మ‌హేష్‌బాబుకి 25వ చిత్రం. 25 చిత్రాల జ‌ర్నీలో త‌న‌కి స‌పోర్ట్‌గా నిలిచిన‌, హిట్స్ ఇచ్చిన ద‌ర్శ‌కులంద‌రికీ థ్యాంక్స్ చెప్పాడు మ‌హేష్‌. హైద‌రాబాద్‌లోని నెక్లెస్‌రో్డ్డులోని ప్రీరిలీజ్ ఈవెంట్ వేదిక నుంచి వారికి కృత‌జ్ఞ‌త‌లు తెలుపుకున్నాడు. ఐతే త‌న కెరియ‌ర్‌ని మ‌లుపుతిప్పి, త‌న‌ని తిరుగులేని సూప‌ర్‌స్టార్‌ని చేసిన ద‌ర్శ‌కుడు పూరి జ‌గ‌న్నాథ్ పేరుని ప్ర‌స్తావించ‌లేదు. 

దాంతో అభిమానులు ఫీల్ అయ్యారు.

ఐతే ఈవెంట్ అయిపోయిన కొద్ది నిమిషాల‌కే.... మ‌హేష్‌బాబు త‌న త‌ప్పిదాన్ని గుర్తించి ట్వీట్ చేశాడు. పూరికి సారి చెప్పాడు. 

"నా జీవితంలో ముఖ్య‌మైన ఓ వ్య‌క్తి గురించి నా ప్ర‌సంగంలో ప్ర‌స్తావించలేక‌పోయాను. పోకిరి సినిమానే న‌న్ను సూప‌ర్‌స్టార్‌గా మ‌లిచింది. థాంక్యూ పూరి గారు. పోకిరి ఇచ్చినందుకు కృత‌జ్ఞ‌త‌లు. ఆ సినిమాని ఎప్ప‌టికీ మ‌రిచిపోలేను," అని ట్వీట్ చేశాడు. ఆ వెంట‌నే పూరి కూడా స్పందించి ల‌వ్ యూ స‌ర్ అంటూ ట్వీటాడు.