మహేష్ విరామం తీసుకోక తప్పదు

Mahesh Babu tot take 3 months break.
Sunday, November 3, 2019 - 18:15

ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు సినిమా చేస్తున్నాడు మహేష్. ఈ మూవీ కొత్త షెడ్యూల్ కేరళలో.  ఈ మూవీ తర్వాత ఓ 3 నెలలు గ్యాప్ తీసుకోవాలని అనుకుంటున్నాడు. తన నెక్ట్స్ సినిమాను ఇంకా ఎనౌన్స్ చేయలేదు ఈ హీరో. మొన్నటివరకు వంశీ పైడిపల్లి, ప్రశాంత్ నీల్, సందీప్ రెడ్డి వంగ లాంటి పేర్లు నలిగాయి. ఇప్పుడీ లిస్ట్ లోకి తాజాగా సురేందర్ రెడ్డి పేరు కూడా చేరింది. తాజా పుకారు ఏంటంటే.. రీసెంట్ గా మహేష్ కు సురేందర్ రెడ్డి ఓ లైన్ చెప్పాడట. అది మహేష్ కు నచ్చినట్టు టాక్. 

కానీ పూర్తి స్క్రిప్ట్ రెడీ అయిన తర్వాతే ఈ మూవీ సెట్ అవుతుందో లేదో తెలీదు. గతంలో మహేష్-సురేందర్ రెడ్డి కాంబోలో అతిథి అనే సినిమా వచ్చింది. అది కాస్తా ఫ్లాప్ అయింది. ఆ తర్వాత మళ్లీ వీళ్లిద్దరూ కలుసుకోలేదు. ఇప్పుడు సైరా లాంటి భారీ మూవీ తీసిన తర్వాత మరోసారి మహేష్ ను కలిశాడట సురేందర్ రెడ్డికి ప్రభాస్ నుంచి కూడా అఫర్ ఉంది. అయితే, సురేందర్ రెడ్డి మూవీ విషయంలో అటు ప్రభాస్ వద్ద, ఇటు మహేష్ వద్ద క్లారిటీ లేదు. ఎందుకంటే... ఫుల్ స్క్రిప్ట్ రెడీ అవ్వాలి. 

అందుకే నెక్స్ట్ మూవీ ఫైనలైజ్ చేసే విషయంలో తొందర పడొద్దు  అని భావిస్తున్నాడు. 

ఈ మధ్య బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ వస్తున్నాడు మహేష్. అందుకే కాస్త గ్యాప్ తీసుకోవాలనే ఉద్దేశంతో సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత గ్యాప్ ఇస్తున్నాడు. అయితే మంచి స్టోరీలైన్, పక్కా స్క్రీన్ ప్లేతో వస్తే ఈలోగానే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి రెడీ. ప్రస్తుతం మహేష్ లిస్ట్ లో ఉన్న దర్శకులెవరి దగ్గర బౌండెడ్ స్క్రిప్ట్ లేదు మరి.