డబ్బింగ్ చెప్పిన మహేష్ కూతురు

Mahesh Babu's daughter Sitara lends voice to Frozen 2
Monday, November 11, 2019 - 16:30

సూపర్ స్టార్ కొడుకు గౌతమ్ ఇప్పటికే నటించాడు. ఇప్పుడు కూతురు కూడా సినిమా రంగ ప్రవేశం చేసింది. మహేష్ కూతురు సితార డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మారింది. ఇటీవల హాలీవుడ్ నిర్మాణ సంస్థలు తమ యానిమేషన్ సినిమాలకి బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ హీరోలతో డబ్బింగ్ చెప్పిస్తున్నాయి. దాంతో వాటి మార్కెట్, కలెక్షన్లు పెరుగుతున్నాయి. అలాగే పెద్ద హీరోల కొడుకులు, కూతుళ్లతో డబ్బింగ్ చెప్పించి సినిమాకి మంచి పబ్లిసిటీ తెప్పించుకుంటున్నాయి. 

అలా మహేష్ బాబు కూతురు సితారకి ఛాన్స్ దక్కింది. వాల్ట్ డిస్నీ నిర్మించిన ఫ్రోజెన్ 2 చిత్రంలోని బేబీ ఎల్సా పాత్రకు తెలుగులో సితార డబ్బింగ్ చెప్పనుందట. ఈ చిన్నారి ఇప్పటికి ఒక యూట్యూబ్ వీడియోస్ చేసింది. ఇప్పుడు డబ్బింగ్ కూడా చెప్పేస్తోంది. 

ఫ్రోజెన్ 2 మూవీ ఈనెల 22న విడుదల కానుంది.