మహేష్‌ కోనేరు చేతికి బిగిల్‌

Mahesh Koneru bags Bigil
Wednesday, September 11, 2019 - 16:15

విజయ్‌ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం..బిగిల్‌. విజిల్‌ని మద్రాసీ యాసలో బిగిల్‌ అంటారు.  స్పోర్ట్స్ యాక్ష‌న్ డ్రామాగా రూపొందుతోన్న `బిగిల్‌` సినిమాకి దర్శకుడు అట్లీ.  ఇంతకుముందు వీరి కాంబినేష‌న్‌లో `తెరి`(పోలీస్‌), `మెర్స‌ల్‌`(అదిరింది) చిత్రాలు సూపర్‌హిట్టయ్యాయి. న‌య‌న‌తార హీరోయిన్‌గా న‌టిస్తోన్న‌ఈ సినిమాను తెలుగు థియేటర్ల హక్కులను యువ నిర్మాత మహేష్‌ కోనేరు కైవసం చేసుకున్నారు. 

``బిగిల్‌` సినిమా హ‌క్కులు మా ఈస్ట్ కోస్ట్ బ్యాన‌ర్‌కు ద‌క్క‌డం చాలా ఆనందంగా ఉంది. నిర్మాత క‌ల్పాతి అఘోరామ్‌గారికి, హీరో విజ‌య్‌గారికి స్పెష‌ల్ థ్యాంక్స్‌.  `118`తో మా బ్యాన‌ర్‌లో సూప‌ర్‌హిట్ సాధించాం. అలాగే జాతీయ ఉత్త‌మ‌న‌టి కీర్తిసురేశ్‌తో `మిస్ ఇండియా` సినిమాను నిర్మిస్తున్నాం. ఈ నేప‌థ్యంలో మా బ్యాన‌ర్‌లో విజ‌య్, అట్లీ క్రేజీ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న హ్యాట్రిక్ చిత్రాన్ని విడుద‌ల చేయ‌డం ఆనందంగా ఉంది. ఈ ఏడాది రూపొందుతోన్న భారీ బ‌డ్జెట్ చిత్రాల్లో ఇదొక‌టి. హీరో విజ‌య్‌గారి కెరీర్‌లో భారీ బ‌డ్జెట్ చిత్ర‌మిది. స్పోర్ట్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌. త్వ‌ర‌లోనే  తెలుగు టైటిల్‌ను త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తాం`` అన్నారు నిర్మాత కోనేరు మహేష్‌.