కళ్యాణ్ రామ్ తో మళ్లీ మహేష్ మూవీ

Mahesh Koneru to produce another film with Kalyan Ram
Tuesday, October 29, 2019 - 14:15

నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ '118' తో భారీ విజయాన్ని అందుకున్నారు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మహేష్ కోనేరు నిర్మించిన ఈ మూవీ విశ్లేషకులను సైతం మెప్పించింది. ఇక మహేష్ కోనేరు తాజాగా  "విజిల్" చిత్రాన్ని తెలుగులో సక్సెస్ ఫుల్ గా విడుదల చేశారు. ఇప్పుడు మరోసారి కళ్యాణ్ రామ్ తో మూవీని ప్రకటించారు. 

"విజయ్ నటించిన విజిల్ చిత్రాన్ని దీపావళి కి తెలుగు రాష్ట్రాలలో విడుదల చేశాం. ఈ చిత్రం భారీ వసూళ్లతో రన్ అవుతోంది. ఈ అకేషన్ లో మా బ్యానర్ లో మరొక కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేస్తున్నందుకు సంతోషంగా ఉంది.  నంద‌మూరి క‌ల్యాణ్ రామ్‌  మా బ్యానర్ కు "118" చిత్రం తో అద్భుతమైన విజయాన్ని అందించారు. ఇప్పుడు మళ్ళీ  మా బ్యానర్ లో ఒక చిత్రాన్ని చేయబోతున్నారు. ఒక కొత్త తరహా కథ తో రూపొందబోతున్న ఈ చిత్రం వివరాలను త్వరలోనే తెలియజేస్తాం," అని అన్నారు నిర్మాత మహేష్ కోనేరు. 

కళ్యాణ్ రామ్ ప్రస్తుతం 'ఎంత మంచివాడవురా' అనే సినిమాలో నటిస్తున్నారు.