ఫస్ట్ టైమ్ మహేష్ అలా మిస్సయ్యాడు

Mahesh to skip summer vacation
Friday, March 20, 2020 - 16:30

వేసవి వచ్చింది.. మరి మహేష్ ఎక్కడుంటాడు?

ఈ ప్రశ్నకు సమాధానం చాలా సింపుల్. ఇండియాలో మాత్రం ఉండదు. ఎంచక్కా భార్యాపిల్లల్ని తీసుకొని విదేశాలకు చెక్కేస్తాడు. వాళ్లతో ఫుల్ గా ఎంజాయ్ చేసి తిరిగొచ్చిన తర్వాత మాత్రమే సినిమాలైనా, షూటింగ్ లైనా. కానీ ఈసారి మాత్రం మహేష్ ఎక్కడికీ వెళ్లడం లేదు. కారణం కరోనా.

యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది కరోనా వైరస్. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 145 దేశాలకు పాకిపోయింది ఈ మహమ్మారి. ఇలాంటి టైమ్ లో విదేశీ పర్యటన పెట్టుకుంటే అంతకంటే పెద్ద రిస్క్ ఏదీ ఉండదు. మరీ ముఖ్యంగా ఇంటర్నేషనల్ ట్రావెల్స్ కు సంబంధించి చాలా దేశాలు ఆంక్షలు విధించాయి. కిందామీదా పడి ఇక్కడ ఫ్లయిట్ ఎక్కినా, మరో దేశంలోకి రానిస్తారనే నమ్మకం లేదు.

అందుకే కష్టమైనా మహేష్ ఈసారి ఇండియాలోనే ఉంటున్నాడు. మరీ ముఖ్యంగా 2 వారాల పాటు ఇంటికే పరిమితం అవ్వాలని నిర్ణయించుకున్నాడు. సో.. ఈసారి సితార-గౌతమ్ కు వేసవి శెలవులు ఇంట్లోనే అన్నమాట. అయితే మహేష్ పిల్లల్ని ఎప్పుడూ డిసప్పాయింట్ చేయడు. కరోనా ప్రభావం తగ్గిన తర్వాత కచ్చితంగా ఏ స్విట్జర్లాండ్ కో, లండన్ కో పిల్లల్ని తీసుకెళ్తాడు.