మహేష్ కూడా మాటలు నేర్చాడు!

Mahesh suprising tweets on Sankranthi 2019 movies
Monday, January 14, 2019 - 16:30

ఒకప్పుడు మహేష్ నుంచి ఓ ట్వీట్ వచ్చిందంటే అది చాలా పెద్ద విషయం. అభిమానులు పండగ చేసుకునేవాళ్లు. మహేష్ ట్వీట్ పై పుంఖానుపుంఖాలుగా వార్తలు కూడా వండివార్చేవారు. కేవలం తన సినిమాలకు సంబంధించి లేదా కుటుంబ సభ్యుల ప్రమోషన్ కోసం మాత్రమే ట్విట్టర్ వాడేవాడు మహేష్. కానీ ఇప్పుడీ హీరోలో మార్పు వచ్చింది. తాజా ట్వీట్లే దీనికి ఉదాహరణ.

సంక్రాంతికి విడుదలైన సినిమాలన్నీ చూసేశాడు మహేష్. వాటిపై ట్వీట్స్ కూడా పెడుతున్నాడు. గడిచిన 3 రోజులలో మహేష్ నుంచి వరుసగా ట్వీట్స్ వచ్చాయి. లెక్కలేనన్ని పొగడ్తలు కురిపించాడు.

కథానాయకుడు సినిమాపై స్పందించాడు మహేష్. సినిమా సూపర్ గా ఉందన్నాడు. ఎన్టీఆర్ కు సిసలైన నివాళి ఇదే అన్నాడు. పేట సినిమాపై కూడా ట్వీట్ చేశాడు. రజనీఫ్యాన్స్ కు పండగే అన్నాడు. టెక్నీషియన్లను మెచ్చుకున్నాడు. ఎఫ్2 సినిమా కూడా చూశానని చెబుతూ వెంకీ-వరుణ్ కు శుభాకాంక్షలు అందించాడు.

ఎన్టీఆర్ బ‌యోపిక్ కాబ‌ట్టి పొగ‌డ‌క త‌ప్ప‌లేదు మ‌హేష్‌కి, ర‌జ‌నీకి స్వ‌త‌హాగా అభిమాని, అలాగే త‌మిళ మార్కెట్ అవ‌స‌రం ఉంది. ఇక ఎఫ్‌2 నిజంగానే ఫ‌న్నీగా ఉంది, పైగా వెంకీతో క‌లిసి న‌టించాడు, నిర్మించింది దిల్ రాజు. అందుకే వ‌రుస‌పెట్టి ట్వీట్ చేశాడు.

మహేష్ ఇలా ట్విట్టర్ లో బ్యాక్ టు బ్యాక్ రియాక్ట్ అవ్వడం ఇదే ఫస్ట్ టైం. దీంతో తమ హీరో కూడా మారాడంటూ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఈ ట్విట్టర్ జోరును మహేష్ ఎన్నాళ్లు కొనసాగిస్తాడో చూడాలి.