నొప్పింప‌క‌, తానొవ్వ‌క‌..మహేష్ పాల‌సీ

Mahesh's cool attitude towards directors
Saturday, May 4, 2019 - 22:15

మ‌హేష్‌బాబు అందరివాడు అనిపించుకోవాల‌నుకుంటున్న‌ట్లుంది. ద‌ర్శ‌కుడు సుకుమార్‌పై ఎలాంటి గ్ర‌డ్జ్ లేద‌ని స్ప‌ష్టం చేశాడు. సుకుమార్‌పై తాను సెటైర్ వేసిన‌ట్లు మీడియా వార్త‌లు రాసింది కానీ తాను ఆ ఉద్దేశంతో అన‌లేద‌ని వివ‌ర‌ణ ఇచ్చాడు. సుకుమార్‌పై ఎలాంటి సెటైర్ వేయ‌లేద‌ని క్లారిటీ ఇచ్చాడు. ఇటీవ‌ల మ‌హ‌ర్షి ప్రీరిలీజ్ ఈవెంట్‌లో వంశీపైడిప‌ల్లిని పొగిడాడు మ‌హేష్‌బాబు. నేను వంశీలోని మంచి గుణాన్ని పొగిడితే....మీడియా దానికి వేరే కోణం జోడించి రాసింది త‌ప్ప సుకుమార్‌పై వ్య‌క్తిగ‌తంగా ఏ కోపం లేదంటున్నాడు. ఇలా సుకుమార్‌ని కూడా కూల్ చేశాడు.

అలాగే రాజ‌మౌళి విష‌యంలోనూ అదే స్పందించాడు. రాజ‌మౌళి గారి క‌మిట్‌మెంట్స్ అయిపోయిన త‌ర్వాత త‌మ కాంబినేష‌న్‌లో సినిమా ఉంటుంద‌ని మ‌ర్యాద‌గానే స్పందించాడు. క‌మిట్‌మెంట్స్ అయిపోవ‌డం అంటే ఇప్ప‌ట్లో అయ్యేనా? త‌్రివిక్ర‌మ్‌తోనూ సినిమా కాంబినేష‌న్ కూడా పాజిటివ్ దిశ‌గానే సాగుతోంద‌ట‌. ఇలా అంద‌రి బ‌డా ద‌ర్శ‌కుల గురించి చాలా పాజిటివ్‌గా స్పందించాడు. ఎవ‌ర్నీ నొప్పింప‌క‌, తానొవ్వ‌క స‌మాధానాలు ఇచ్చాడు.

ఐతే స్ర్కిప్ట్‌ల విష‌యంలో మాత్రం రాజీప‌డ‌డ‌ట‌. అక్క‌డ ద‌ర్శ‌కుల‌కి మొహ‌మాటం లేకుండా చెప్పేస్తాడ‌ట‌.