మ‌జిలీకి అంత వ‌చ్చిందా?

Majili gets big additional revenue
Thursday, March 7, 2019 - 10:30

పెళ్ల‌యిన త‌ర్వాత నాగ చైత‌న్య‌, స‌మంత మొద‌టిసారిగా క‌లిసి న‌టిస్తున్న సినిమా.. "మజిలీ". రియ‌ల్ లైఫ్ క‌పుల్ రీల్‌లైఫ్‌లోనూ భార్య‌భ‌ర్త‌లుగానే న‌టిస్తుండ‌డంతో సినిమాపై ఆస‌క్తి మొద‌లైంది. పైగా ఆ మ‌ధ్య విడుద‌లైన ట్ర‌యిల‌ర్ ఆక‌ట్టుకొంది. దాంతో అంచ‌నాలు పెరిగాయి. ఐతే ఈ సినిమా శాటిలైట్‌, డిజిట‌ల్‌, హిందీ రైట్స్ భారీ మొత్తానికి పోయాయ‌ని అపుడే కోత‌లు మొద‌లు అయ్యాయి. ఈ మూడు రైట్స్‌కి క‌లిపే 12 కోట్ల రూపాయ‌లు వ‌చ్చాయ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

ఒక ల‌వ్‌స్టోరీకి హిందీ డ‌బ్బింగ్ రైట్స్ పెద్దగా ఏమీ రాద‌నేది మార్కెట్ గురించి తెలిసిన‌వారు ఎవ‌రైనా చెపుతారు. యాక్ష‌న్ సినిమాల‌కే అక్క‌డ డిమాండ్ ఉంటుంది. 

ఐతే..."మజిలీ"కి లోక‌ల్ మార్కెట్‌లో బాగా క్రేజ్ ఉంది. కాబ‌ట్టి మ‌న ద‌గ్గ‌ర తెలుగు శాటిలైట్ రైట్స్‌, డిజిట‌ల్ రైట్స్ ద్వారా నిర్మాత‌ల‌కి బాగానే గిట్టుబాటు అయి ఉంటుంద‌న‌డంలో ఎలాంటి డౌట్ లేదు. ఈ రెండింటి ద్వారానే ఏడు, ఎనిమిది కోట్లు లాగేశారు నిర్మాతలు. ఇక థియేట‌ర్ల నుంచి మ‌రో ప‌ది కోట్లు వ‌స్తే లాభాలు చూస్తారు నిర్మాత‌లు. ఏప్రిల్ 5న విడుద‌ల కానున్న ఈ సినిమా భారీ ఓపెనింగ్స్‌ని పొంద‌డం ఖాయం. స‌మ్మ‌ర్ సీజ‌న్‌లో వ‌స్తున్న తొలి మూవీ కావ‌డం, మంచి అంచ‌నాలు ఉండ‌డం మ‌రో రీజ‌న్‌.