అబ్బే చ‌ర్చిలో చేసుకోవ‌ట్లేదు

Malaika Arora talks about her church wedding with Arjun Kapoor
Tuesday, March 12, 2019 - 23:45

మ‌లైక అరోరా ఖాన్ రెండో పెళ్లికి రెడీ అవుతోంది. త‌న క‌న్నా 15 ఏళ్ల చిన్న‌వాడైన అర్జున్‌క‌పూర్‌తో ఆమె కొన్నాళ్లుగా ల‌వాయ‌ణం సాగిస్తోంది. ఇపుడు వీరిద్ద‌రూ పెళ్లి చేసుకోనున్నారు. అర్జున్ క‌పూర్‌.. చ‌ర్చిలో పెళ్లి చేసుకుందామ‌ని ప్ర‌పోజ‌ల్ పెట్టాడ‌ని బాలీవుడ్ మీడియా వెబ్‌సైట్‌ల‌లో వార్త‌లు వ‌చ్చాయి. ఈ ప్ర‌చారంపై మ‌లైక స్పందించింది.

చ‌ర్చ‌లో పెళ్లి అనేది అబ‌ద్దం. పెళ్లి ఎపుడు చేసుకోవాల‌నేది డిసైడ్ అవ్వ‌లేదింకా, అని క్లారిటీ ఇచ్చింది మ‌లైక‌. మొద‌టి భ‌ర్త అర్బాజ్‌ఖాన్ నుంచి విడాకులు తీసుకున్న త‌ర్వాత అర్జున్ క‌పూర్ గురించి ఆమె అంద‌రికీ ప‌రిచ‌యం చేస్తోంది. విడాకుల‌కి ముందే ఆమె అర్జున్ క‌పూర్‌తో స‌హ‌జీవ‌నం సాగించింది. 

ప్రేమ‌కి, పెళ్లికి వ‌య‌సు అంత‌రం అనేది స‌మ‌స్య కాద‌ని చెపుతోంది. నా భ‌ర్త నుంచి విడిపోవడానికి అనేక కార‌ణాలున్నాయి. అన్నింటి క‌న్నా ముఖ్యం ఒకే వేవ్‌లెంగ్త్‌లో ఉన్న వ్య‌క్తితోనే జీవితాన్ని పంచుకోగ‌ల‌ను నేను. అది అపుడు లేదు. అందుకే విడాకులు తీసుకొని ఇపుడు స్వేఛ్చ‌గా ఉన్నాను అని వివ‌ర‌ణ ఇచ్చింది.

మ‌లైక తెలుగులో "అతిథి" సినిమాలోనూ, "గ‌బ్బ‌ర్‌సింగ్‌"లోనూ ఐటెంసాంగ్‌ల‌లో క‌నిపించింది.