అలా ఐనా, ఇలా ఐనా అత‌నంటే ఇష్టం

Malaika likes Arjun Kapoor this way or that way
Wednesday, February 27, 2019 (All day)

వారి ఇద్ద‌రి మ‌ధ్య 15 ఏళ్ల గ్యాప్ ఉంది. ఏజ్ గ్యాప్ ప్రేమ‌కి, పెళ్లికి అడ్డంకి కాదు క‌దా. ట్రోల్స్ ఎలా కామెంట్ చేసినా... మ‌లైకా ప‌ట్టించుకోవ‌డం లేదు. ఇప్ప‌టి వ‌ర‌కు వారి మ‌ధ్య ఉన్న అపైర్ గురించి మీడియా మాత్ర‌మే వార్త‌లు రాస్తూ వ‌స్తోంది. ఆమె ఓపెన్‌గా చెప్ప‌లేదు. మొద‌టిసారి నేష‌న‌ల్ టెలివిజ‌న్‌పై ఓప‌న్ అయింది 44 ఏళ్ల మ‌లైక‌. 

క‌ర‌ణ్ జోహ‌ర్ నిర్వ‌హిస్తున్న టాక్ షోలో ఆమె తాజాగా పాల్గొంది. ఈ కార్య‌క్ర‌మంలో అర్జున్ క‌పూర్ ప్ర‌స్తావ‌న వ‌చ్చింది. కొన్ని విష‌యాల్లో అర్జున్ క‌పూర్ అంటే ఇష్ట‌మ‌ని సీనియ‌ర్ నటి కిర‌ణ్ ఖేర్ పేర్కొంటే.. మ‌లైక ఆమె మాట‌ని అందుకుంటే ఆ విష‌యంలోనే కాదు ఏ విష‌యంలో అయినా అర్జున్ నాకు ఇష్టమ‌ని అస‌లు మేట‌ర్‌ని చెప్పింది. అలా అయినా, ఇలా అయినా 30 ఏళ్ల అర్జున్ క‌పూర్ అంటే పిచ్చి అని చెప్పింది. 

మ‌లైక .. అర్జున్ ని పెళ్లి చేసుకోవాల‌న్న ఉద్దేశంతోనే త‌న భ‌ర్త అర్బాజ్‌ఖాన్‌కి గ‌తేడాది విడాకులు ఇచ్చింద‌నేది టాక్‌. ఐతే అర్బాజ్ నుంచి విడిపోవ‌డానికి కార‌ణం అది కాదు అని మ‌లైక అంటోంది. తాము ఇద్ద‌రం భార్య‌భ‌ర్త‌లుగా బ‌త‌క‌డం మానేసి చాన్నేళ్ల అయింద‌నీ, ఇద్ద‌రి మ‌ధ్య పూడ్చ‌లేని అగాధం ఎప్ప‌టి నుంచో ఉంద‌ని చెప్పింది. త్వ‌ర‌లోనే మ‌లైక‌, అర్జున్ పెళ్లి చేసుకోనున్నార‌ట‌.