ఇంత అందం తెలుగోళ్లు మిస్సవుతున్నారే

Malavika Mohan debut Telugu film scrapped
Sunday, September 22, 2019 - 06:15

ఈ అమ్మడి పేరు మాళవిక మోహనన్. ఈ ఫోటో చూస్తే చాలు ఎంత హాట్ అనేది స్పెషల్ గా చెప్పక్కర్లేదు. కత్తిలాంటి ఫిగర్, దాన్ని దాచుకొని నైజం  ఆమెది. ఈ ఒక్క ఫోటో చూసి ఆలా అంటున్నాం అనుకుంటే పొరపాటు. గూగుల్ చెయ్యండి....ఇంకా కుదిరితే ఇన్ స్టాగ్రామ్ లో చూడండి. ఎంతగా అక్కడ అందచందాలు పరిచిందో అర్థం అవుతుంది. ఇలాంటి భామ తెలుగులోకి అరంగేట్రం చేస్తోందన్న వార్త వచ్చినప్పుడు కుర్రాళ్ళు పండగ చేసుకున్నారు. 

విజయ్ దేవరకొండ సరసన ఈ భామ బుక్కైంది. హీరో అనే పేరుతో విజయ్ దేవరకొండ ఒక సినిమాని మూడు నెలల క్రితం గ్రాండ్ గా లాంచ్ చేశాడు. కానీ ఈ భామ తెలుగు ఎంట్రీకి ఆదిలోనే బ్రేక్ పడింది. ఆ సినిమా ఇప్పుడు ఆగిపోయింది. ఎప్పుడు మొదలవుతుందో ఎవరు చెప్పలేరు. 

డియర్ కామ్రేడ్ బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశపర్చడంతో మైత్రి మూవీ మేకర్స్ ఆ 'హీరో' సినిమాని పక్కన పెట్టేసింది. ఆలా మాళవిక తెలుగు అరంగేట్రం ఆగింది.