సాహోలో అలా... సోషల్ మీడియాలో ఇలా!

Mandira Bedi continues her hot poses
Wednesday, September 4, 2019 - 20:15

మందిరా బేడీ.. 47 ఏళ్ల హాట్ బాంబ్. ఇంతకంటే ఈమెను వర్ణించడానికి మాటల్లేవు. ఆమె అందాలకు, వయసకు అస్సలు సంబంధం లేదు. 20 ఏళ్ల పడుచుపిల్లలా ఆమె అందాలు ఆరబోస్తే కుర్రకారు చిత్తయిపోతుంది. తాజాగా ఈమె మరోసారి సోషల్ మీడియాలో సెన్సేషన్ అయింది. దీనికి కారణం సాహో సినిమా.

సాహో సినిమాలో లేడీ విలన్ గా నటించింది మందిరా బేడీ. కల్కి అనే పాత్రలో చీరకట్టులో ఆమె అందంగా కనిపించింది. అదే టైమ్ లో సోషల్ మీడియాలో మందిరా బేడీని చూస్తే మాత్రం ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే. బ్యాక్ టు బ్యాక్ బికినీ ఫొటోల్ని ఆమె షేర్ చేస్తోంది. 

దీంతో సోషల్ మీడియాలో ఒకలా, సాహో సినిమాలో మరోలా ఉందంటూ ఆమెపై కామెంట్స్ పడుతున్నాయి. అయితే చాలా కామెంట్స్ పాజిటివ్ గానే ఉన్నాయి. మందిరా బేడీ ఇప్పుడు ఫుల్ హ్యాపీగా ఉంది. ఆ ఆనందంలో సోషల్ మీడియాలో మరిన్ని హాట్ ఫొటోస్ అప్ లోడ్ చేస్తోంది