ఇక మంచు మ‌నోజ్ మ‌కాం తిరుప‌తిలోనే!

Manoj embarks on a new journey, shifts home to Tirupathi
Sunday, October 21, 2018 - 19:00

మంచు మ‌నోజ్ సినిమాల నుంచి సెమీ రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించాడు. విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌లు చేసి ప్రేక్ష‌కుల‌ను మెప్పించాల‌నే త‌న దాహం తీర‌దంటూనే సినిమా ఇండ‌స్ర్టీకి కేంద్ర‌మైన హైద‌రాబాద్‌కి టాటా బైబై చెపుతున్నాడు. బ‌హుశా టాలీవుడ్ నుంచి ఆంధ్రాకి షిప్ట్ అవుతున్న తొలి హీరోగా మ‌నోజ్ క్రెడిట్ తెచ్చుకుంటాడేమో. రాయ‌ల‌సీమ‌కి వ‌స్తున్నా..రాగి సంక‌టి, మ‌ట‌న్ పులుసు రెడీ చేయ‌మ‌ని అభిమానుల‌ను కోరుతున్నాడు. 

 ప్ర‌పంచ‌మంతా తిరిగాను, దేశ‌మంతా చుట్టేశాను.కానీ నిజ‌మైన ప్ర‌శాంత‌త తాను పెరిగిన తిరుప‌తిలోనే దొరికొంద‌ని, ఇక త‌న మ‌కాం తిరుప‌తికి షిప్ట్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించాడు మ‌నోజ్‌. హీరోగా వ‌రుస అప‌జ‌యాలు చూసి, కెరియ‌ర్‌లో ఎటువంటి ఎదుగూ బొదుగూ లేక‌పోవ‌డంతో చాలా కాలంగా ఆలోచ‌న‌లో ప‌డ్డాడు మ‌నోజ్‌.

ఫైన‌ల్‌గా రాజ‌కీయాల వైపు ఆస‌క్తి చూపుతున్న‌ట్లు క‌నిపిస్తోంది. ఐతే రాజ‌కీయం పేరు చెప్ప‌కుండా సేవ కోసం తిరుప‌తికి షిప్ట్ అవుతున్నాన‌ని చెప్పాడు. అభిమానుల‌కి రాసిన లేఖ‌ని ట్విట్ట‌ర్‌లో షేర్ చేశాడు మ‌నోజ్‌. ఇక నా జీవితాన్ని ఈ నేల‌కి అంకితం చేస్తున్నాన‌ని అంటున్నాడు.