ఇది మల్టీమల్టీ స్టారర్

Manoj plans multi-starrer
Tuesday, October 29, 2019 - 19:30

సాధారణంగా ఒకరు కంటే ఎక్కువమంది హీరోలు నటిస్తే దాన్ని మల్టీస్టారర్ అంటాం. కానీ మంచు మనోజ్ మాత్రం తను మల్టీమల్టీ స్టారర్ సినిమా తీస్తానంటున్నాడు. రీసెంట్ గా MM Arts అనే బ్యానర్ స్థాపించిన ఈ హీరో, తను నిర్మాతగా మారి నలుగురు లేదా ఐదుగురు హీరోలతో ఓ మాంఛి కామెడీ సినిమా చేస్తానంటున్నాడు. అది కూడా తెలుగు-తమిళ భాషల్లో కలిపి తీస్తాడట. దీనికి ఓ కారణం ఉంది.

నిర్మాతగా తీయబోయే తొలి సినిమాలో తన క్లోజ్ ఫ్రెండ్స్ తో పాటు అన్నయ్యను పెట్టాలనుకుంటున్నాడు మనోజ్. ఈ సినిమాలో మంచు విష్ణు నటించే అవకాశం ఉంది. అటు తన తమిళ ఫ్రెండ్స్ శింబు, మహత్, ఆది పినిశెట్టి లాంటి నటులు కూడా ఇందులో నటించే అవకాశం ఉంది. వీళ్లతో పాటు మంచు మనోజ్ కనిపించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇలా అందరూ కలిస్తే ఇది మల్టీస్టారర్ కంటే పెద్దది అవుతుందని, అందుకే ఇది మల్టీమల్టీస్టారర్ సినిమా అంటున్నాడు మంచు మనోజ్.

అయితే ఈ మల్టీస్టారర్ ప్లాన్ కేవలం ఒక స్టోరీకి సంబంధించి మాత్రమే. దీంతో పాటు మరో 3 స్టోరీలైన్స్ ప్రస్తుతం మంచు మనోజ్ దగ్గర ఉన్నాయి. వీటిలోంచి ఓ కథను అతడు సెలక్ట్ చేసుకోవాలి. నిర్మాతగా తొలి ప్రయత్నంగా మల్టీస్టారర్ కథను ఎంచుకోవాలా లేక మరో సింపుల్ స్టోరీతో సెట్స్ పైకి రావాలా అనే విషయంపై మనోజ్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.