మారుతి, సాయి తేజ్ సినిమా సెట్‌పైకి

Maruthi, SDT film will go to sets shortly
Saturday, May 11, 2019 - 23:45

ద‌ర్శ‌కుడు మారుతికి బిగ్ రేంజ్ హిట్ వ‌చ్చి చాలా కాల‌మే అయింది. ఆయ‌న ఇపుడు బ్లాక్‌బ‌స్ట‌ర్ ఇవ్వాల‌ని క‌సిగా ఉన్నాడు. ఇక సాయిధ‌ర‌మ్ తేజ‌కి కూడా బ్లాక్‌బ‌స్ట‌ర్ కావాలి. "చిత్ర‌ల‌హ‌రి"తో ఊపిరి పీల్చుకునే అవ‌కాశం ద‌క్కింది. వ‌రుస ఫ్లాప్‌ల‌కి అడ్డుక‌ట్ట వేసింది చిత్ర‌ల‌హ‌రి. ఓ మోస్త‌రు విజ‌యం అనిపించుకొంది. దాంతో ఈ కాంబినేష‌న్ కుదిరింది. త్వ‌ర‌లోనే సెట్ మీద‌కి వెళ్ల‌నుంది ఈ మూవీ.

"చిత్ర‌ల‌హ‌రి" విడుద‌ల‌కి ముందే మారుతి స్టోరీ లైన్ చెప్పాడు. రీసెంట్‌గా మొత్తం స్టోరీ, స్క్రీన్‌ప్లే నేరేట్ చేశాడ‌ట‌. ఇక‌పై అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సినిమాలు చేయ‌కూడ‌ద‌ని సాయి ధ‌ర‌మ్ అనుకుంటున్నాడు. మైండ్‌లెస్ మాస్ సినిమాల వ‌ల్లే త‌న కెరియ‌ర్ పూర్తిగా వెనుక‌బ‌డింద‌ని గ్ర‌హించాడు. కొంత క్లాస్‌, కొంత మాస్ ఎలిమెంట్స్ ఉండేలా చూసుకుంటాడ‌ట‌. మారుతికి కూడా ఇదే విష‌యాన్ని చెప్పాడు. క్లాసీ కామెడీ మీద ఫోక‌స్ పెట్ట‌మ‌ని కోరాడ‌ట‌.

ఈ సినిమాని గీతాఆర్ట్స్‌కి చెందిన జీఏ2 పిక్చ‌ర్స్ నిర్మించ‌నుంది.