ఇకపై మారుతికి బేర‌మ్‌లుండేనా?

Maruthi's brand takes a beating
Thursday, October 4, 2018 - 22:00

ద‌ర్శ‌కుడు మారుతి గ్రాఫ్ బాగా ప‌డిపోయింది. ఒక‌పుడు ప‌ట్టింద‌ల్లా బంగారం. ఇపుడు త‌గ్గింది బేరం. 

బాబు బంగారం, మ‌హానుభావుడు, శైల‌జారెడ్డి అల్లుడు చిత్రాల‌తో యావ‌రేజ్ చిత్రాల ద‌ర్శ‌కుడిగా ఇమేజ్ స్థిర‌ప‌డింది. భారీ హిట్స్ ఇచ్చే ద‌ర్శ‌కుడు అనిపించుకోలేక‌పోతున్నాడు. ఇక ఆయ‌న క‌థ‌ల వంట‌కాలతో మొద‌లుపెట్టిన సినిమాలు కూడా ధబేల్ ధ‌బేల్ మ‌ని ఫ్లాప్ అవుతూ వ‌స్తున్నాయి. మారుతి అందించిన క‌థో, క‌థ‌నమో, కాన్సెప్ట్ పేరు ఏదైనా.. ఆయ‌న బ్రాండ్‌లో వ‌చ్చిన రోజులు మారాయి, బ్రాండ్‌బాబు వంటివ‌న్నీ బాక్సాఫీస్‌వ‌ద్ద ప‌డ‌కేశాయి. దాంతో బ్రాండ్ మారుతి బీట‌లు వారింది. 

ఈ వీకెండ్ నోటాతో పోటీప‌డుతున్న భ‌లే మంచి చౌక‌బేరం కూడా మారుతి కాన్సెప్ట్‌తో రూపొందిన‌దే. న‌వీద్‌, 'కేరింత' నూకరాజు, యామిని భాస్కర్‌ల‌తో  కె.కె.రాధామోహన్‌ సమర్పణలో మురళీకృష్ణ ముడిదాని దర్శకత్వంలో అరోళ్ళ సతీష్‌కుమార్‌ నిర్మించిన ఈ చిత్రంపై పెద్ద‌గా అంచనాలు అయితే లేవు. ఐతే మారుతి బ్రాండ్ మాత్రం అసోసియేట్ అయి ఉంది. ఇది హిట్ట‌యితే..మ‌ళ్లీ మారుతికి ఇలాంటి బేరాలుంటాయి. లేదంటే ఆయ‌న బేరాల‌కి కూడా బీటింగ్ త‌ప్ప‌దు.