బుల్లితెరపై మెరిసిన చిన్న సినిమా

Mathu Vadalara gets good ratings on TV
Friday, March 13, 2020 - 13:45

"మత్తు వదలరా" అనే సినిమా ఆమధ్య రిలీజై సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. చిన్న సినిమాల్లో పెద్ద విజయంగా దీన్ని చెబుతారు. అంతా కలిపి కోటి రూపాయల్లో తీసిన ఈ సినిమా నిర్మాతలకు మంచి లాభాలు తెచ్చిపెట్టడంతో పాటు, అందులో నటించిన నటీనటులు, టెక్నీషియన్స్ కు మంచి గుర్తింపు కూడా తెచ్చిపెట్టింది. ఇప్పుడీ సినిమా స్మాల్ స్క్రీన్ పై కూడా మెరిసింది.

స్మాల్ స్క్రీన్ లో ఈ సినిమాను ప్రసారం చేస్తే ఏకంగా 4.05 (అర్బన్) రేటింగ్ రావడం విశేషం. అది కూడా నాన్-పీక్ టైమ్ లో ప్రసారమై ఇంత రేటింగ్ రావడం నిజంగా గొప్ప విషయం. అవును.. ఈ సినిమాను స్టార్ మా ఛానెల్ ఆదివారం మధ్యాహ్నం సమయంలో ప్రసారం చేసింది. సాధారణంగా సినిమాలకు మంచి రేటింగ్స్ రావాలంటే శనివారం సాయంత్రం లేదా ఆదివారం సాయంత్రం ప్రసారం చేస్తుంటారు. కానీ మధ్యాహ్నం టైమ్ లో టెలికాస్ట్ అయి కూడా మంచి టీఆర్పీ సాధించింది ఈ సినిమా.

అలా సిల్వర్ స్క్రీన్ పైనే కాకుండా..స్మాల్ స్క్రీన్ పై కూడా ఈ సినిమా సక్సెస్ అయింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో ఇప్పటివరకు వచ్చిన సినిమాల్లో అత్యంత తక్కువ బడ్జెట్ లో వచ్చిన మూవీ ఇదొక్కటే.