ఓటీటీలో మేడే స్పెషల్

MayDay movies on OTT platforms
Friday, May 1, 2020 - 16:45

థియేటర్స్ బంద్ అవ్వడంతో ఇప్పుడంతా ఓటీటీ సీజన్ నడుస్తోంది. ఏ రోజు ఏ ఫ్లాట్ ఫామ్ పై ఏది రిలీజ్ అవుతుందనే ఇంట్రెస్ట్ అందర్లో ఉంటోంది. పైగా ఈరోజు మేడే కూడా కావడంతో చాలా యాప్స్ సరికొత్త కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకొచ్చాయి. నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ లాంటి పాపులర్ యాప్స్ లో కొత్త కంటెంట్ ఏమొచ్చిందో ఓసారి చూద్దాం.

నెట్ ఫ్లిక్స్ లో ఈరోజు ఒకేసారి 7 సినిమాలు స్ట్రీమింగ్ కు వచ్చాయి. వీటిలో డాన్స్ విద్ మి, సెలెనా లాంటి పాత సినిమాలతో పాటు రెండేళ్ల కిందటొచ్చిన డెన్ ఆఫ్ థీవ్స్ అనే సినిమా కూడా పెట్టారు. వీటితో పాటు క్రాక్డ్ అప్, ట్రబుల్ విద్ ద కర్వ్ లాంటి సినిమాలు కూడా అందుబాటులోకి వచ్చాయి.

అటు ఒరిజినల్ కంటెంట్ ను కూడా భారీ ఎత్తున రిలీజ్ చేసింది నెట్ ఫ్లిక్స్. ట్రాన్స్ ఫార్మర్స్ సీజన్-2ను స్ట్రీమింగ్ కు పెట్టడంతో పాటు.. ఆల్ మోస్ట్ హ్యాపీ, ఆల్ డే అండ్ ఎ నైట్, మిసెస్ సీరియల్ కిల్లర్ లాంటి ఒరిజినల్స్ ఉన్నాయి. ఈరోజు రిలీజైన మిసెస్ సీరియల్ కిల్లర్ తో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ వెబ్ కంటెంట్ లోకి ఎంటరైంది.

ఇక అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో టామ్ హ్యాంక్స్ నటించిన ఏ బ్యూటిఫుల్ డే ఇన్ ద నైబర్ హుడ్, తాప్సి నటించిన థప్పడ్ సినిమా సినిమాల్ని స్ట్రీమింగ్ కు ఉంచారు. వీటితో పాటు అప్ లోడ్, టామ్ వాకర్ అనే రెండు ఒరిజినల్ కంటెంట్ ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది