అర్జున్‌, శ్రుతి రాజీప‌డ్డారా?

Me Too: Update on Arjun Sarja and Shruti Hariharan case
Tuesday, February 12, 2019 - 15:30

యాక్ష‌న్ కింగ్ అర్జున్ త‌న‌ని లైంగికంగా వేధించాడ‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది క‌న్న‌డ న‌టి శ్రుతి హ‌రిహ‌ర‌న్‌. సెట్‌లోనే శ్రుతి మించాడ‌ని కూడా చెప్పింది. ఆమె ఆరోప‌ణ‌లు చేయ‌డ‌మే కాదు అర్జున్‌పై కేసు కూడా పెట్టింది. కోర్టులో న‌డుస్తోంది ఈ కేసు. ఐతే ఇపుడు వీరిద్ద‌రి మ‌ధ్య తెర‌చాటు రాజీ ఒప్పందం జ‌రిగింద‌ని క‌న్న‌డ చిత్ర‌సీమ‌లో చెవులు కొరుక్కుంటున్నారు. అర్జున్ బంధువు చిరంజీవి స‌ర్జా క‌న్న‌డంలో లీడింగ్ హీరోల్లో ఒక‌రు. ఇపుడు ఆయ‌న స‌ర‌స‌న న‌టించేందుకు శ్రుతి అంగీక‌రించింది. దాంతో అర్జున్‌తో ఆమె రాజీప‌డింద‌నే పుకార్ల‌కి బ‌లం వ‌చ్చింది.

శ్రుతి హ‌రిహ‌ర‌న్‌..గ‌తంలోనే రాజీ ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ని వార్త‌లు వ‌చ్చిన‌పుడే ఘాటుగా స్పందించింది. తాను వెన‌క్కి త‌గ్గేది లేద‌ని చెప్పింది. మీటూ ఉద్య‌మం నీరు కారొద్ద‌ని, ఈ ఉద్య‌మం వ‌ల్ల ఎంద‌రో అమ్మాయిల జీవితాలు బాగుప‌డుతాయ‌ని పేర్కొంది. శ్రుతి ఇప్ప‌టికీ అదే మాటపై ఉంది. కానీ గుస‌గుస‌లు మాత్రం త‌గ్గ‌డం లేదు.

మ‌రోవైపు, ఈ కేసులో ఇంకా చార్జ్‌షీట్ ద‌ఖ‌లు ప‌ర్చ‌లేదు. ఇంకా విచార‌ణ పూర్తి కాలేదట‌. చార్జ్‌షీట్ ఫైల్ చేసేందుకు మ‌రింత స‌మ‌యం కావాల‌ని బెంగుళూర్‌లోని కబ్బన్ పార్క్ పోలీసులు కోరుతున్నారు.