అది ఇస్తే ఇద‌స్తామంటే ఒప్పుకోవ‌ద్దు: మీనా

Meena talks about casting couch trend
Monday, August 27, 2018 - 20:00

క్యాస్టింగ్ కౌచ్‌తో నేటి త‌రం హీరోయిన్లు ఇబ్బంది ప‌డుతున్న‌ట్లే అప్ప‌ట్లో మాకు ఇలాంటి స‌మ‌స్యే ఉండేద‌ని అంటోంది 90 నాటి అగ్ర క‌థానాయిక మీనా. "సీతారామ‌య్య‌గారి మ‌న‌వ‌రాలు", "చంటి", "అబ్బాయిగారు" వంటి సినిమాల‌తో ఓవ‌ర్‌నైట్ టాప్ హీరోయిన్‌గా ఎదిగిన మీనాని కూడా అప్ప‌ట్లో కొంద‌రు ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు వేధించార‌ట‌. చాలా మంది మ‌మ్మ‌ల్ని నైట్‌కి ర‌మ్మ‌ని అడిగేవార‌ని కానీ మేం అప్పుడు తెలివిగా అలాంటి వారిని దూరం పెట్టామ‌ని చెపుతోంది మీనా.

ఆనాటి హీరోల కార‌ణంగా ఇండ‌స్ట్రీలో హాయిగా కెరియ‌ర్‌ని కొన‌సాగించామ‌ని చెప్పింది.

అమ్మాయిలు కూడా కొంచెం జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని స‌ల‌హా ఇచ్చింది. అది ఇస్తే ఇది ఇస్తామ‌నే కండీష‌న్ రాగానే నిర్మోహ‌మాటంగా తిర‌స్క‌రించాలి. ఆశ‌ప‌డి లొంగితే అంతే..అని ఆమె కొత్త త‌రం హీరోయిన్ల‌కి స‌జెష‌న్ ఇచ్చింది. టాలెంట్‌ని న‌మ్ముకొండి... మీలో టాలెంట్ ఉంటే ఎప్పటికైనా మీకు మంచి అవకాశం లభిస్తుంద‌ని చెప్పింది మీనా.

ప్ర‌స్తుతం మీనా క్యార‌క్ట‌ర్ రోల్స్‌కి షిప్ట్ అయింది. ఇటీవ‌ల వెంక‌టేష్ స‌ర‌స‌న "దృశ్యం"లో న‌టించింది. అలాగే "సాక్ష్యం" సినిమాలో హీరోకి త‌ల్లిగా క‌నిపించింది.