మహిళాదినోత్స‌వం నాడు ల‌క్ష్మీ స్పెష‌ల్‌

MEET MRS. SUBBALAKSHMI ON ZEE5
Tuesday, March 5, 2019 - 16:30

విభిన్నమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది నటి మంచు లక్ష్మి. వెండితెర, బుల్లితెర ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువైన మంచు లక్ష్మి... ఇప్పుడు వెబ్ సిరీస్ ద్వారా డిజిటల్ ఆడియెన్స్ ని కూడా ఎంటర్ టైన్ చేయనుంది. మిసెస్ సుబ్బలక్ష్మి పేరుతో రూపొందించిన వెబ్ సిరీస్ లో మంచు లక్ష్మి టైటిల్ రోల్ ప్లే చేసింది.

తొలిసారిగా మంచు లక్ష్మి వెబ్ సిరీస్ ద్వారా ఆడియెన్స్ ముందుకు రానున్నారు. మార్చి నుంచి ZEE5 యాప్ ద్వారా మిసెస్ సుబ్బలక్ష్మి ఎపిసోడ్స్ ని వీక్షించొచ్చు. వంశీ ఈ వెబ్ సిరీస్ కు దర్శకుడు.

 శ్రీనివాస్ అవసరాల, వేణు టిల్లు, మహేష్ విట్ట, సుదర్శన్, జబర్దస్త్ అప్పారావ్, చిత్రం శ్రీను ఇతర కీలక పాత్రలు పోషించారు. భర్త తనతో సమయం గడపకపోవటం.. ప్రేమని పంచకపోవటం తో తనతో తానే ఒక స్వేచ్ఛాయుతమైన జీవితం గడపాలనుకునే పాత్రలో మంచు లక్ష్మి నటించారు.