బిగ్ బాస్ 3 ఫినాలేకి మెగా అట్రాక్షన్

Megastar to attend Bigg Boss 3 Finale?
Tuesday, October 29, 2019 - 14:00

బిగ్ బాస్ మూడో సీజన్ ఈ ఆదివారం ముగియనుంది. నవంబర్ 3న గ్రాండ్ ఫినాలే జరుగుతుంది. ఆ రోజే ఈ సీజన్ విన్నర్ ఎవరో తెలుస్తుంది. శ్రీముఖి, వరుణ్ సందేశ్, రాహుల్ సిపిల్గంజ్ ...ఫేవరేట్ లుగా ఉన్నారు. ఎవరు విజేత అనేది చూడాలి. ఐతే విజేతకి టైటిల్ ప్రదానం చేసేందుకు ఒక బిగ్ సెలబ్రిటీ గెస్ట్ కావాలి. దాని కోసం మెగాస్టార్ చిరంజీవిని అడుగుతోంది బిగ్ బాస్ టీం. 

నాగార్జున హోస్ట్ గా ఉన్న ఈ షోకి చిరంజీవి గెస్ట్ గా వస్తే అదిరిపోతోంది. చిరంజీవి కూడా ఇంకా కొత్త సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టలేదు. ప్రస్తుతం ఖాళీగానే ఉన్నారు. పైగా చిరంజీవికి, నాగార్జునకి మంచి దోస్తీ ఉంది. మరి చిరంజీవి వస్తారా అనేది చూడాలి. 

ఒకవేళ చిరంజీవి ఒప్పుకోకపోతే అనే ఆప్షన్ కూడా అలోచించి పెట్టుకోంది బిగ్ బాస్ 3 టీం.