మెహ్రీన్‌ని మ‌రిచిపోయిన‌ట్లేనా?

Mehreen not getting new offers
Tuesday, April 23, 2019 - 14:15

వెంక‌టేష్‌, వ‌రుణ్ తేజ్‌, త‌మ‌న్న‌, మెహ్రీన్ న‌టించిన "ఎఫ్ 2" సినిమా 80 కోట్ల‌పైనే వ‌సూళ్లు అందుకొని బాక్సాఫీస్‌కి ఊపు తీసుకొచ్చింది. వెంక‌టేష్ ఈ సినిమా త‌ర్వాత మ‌ళ్లీ బిజీ అయ్యారు. వ‌రుణ్ తేజ్ కూడా రెండు సినిమాలు చేస్తున్నాడు. త‌మ‌న్నకి మ‌ళ్లీ క్రేజ్ వ‌చ్చింది. ఇక ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి ఏకంగా జాక్‌పాట్ కొట్టేసి మ‌హేష్‌బాబు సినిమాని డైర‌క్ట్ చేస్తున్నాడు. "ఎఫ్ 2" స‌క్సెస్‌ని ఏ మాత్రం క్యాష్ చేసుకోలేక‌పోతున్న భామ‌.. మెహ్రీన్‌.

ఆ సినిమాలో హ‌నీ ఈజ్ బెస్ట్ అని అద‌ర‌గొట్టింది మెహ్రీన్‌. ఐతే జ‌నంలో మాత్రం ఈ భామ‌పై అంత క్రేజ్ లేదు. "ఎఫ్‌2 "విడుద‌ల‌కి ముందే బాబోయ్ మెహ్రీన్‌ని ఎందుకు తీసుకుంటున్నారు? ఆమెలో అంత "టాలెంట్‌"ని మేక‌ర్స్ ఏమి చూస్తున్నార‌ని కామెంట్స్ వినిపించాయి.

దాంతో ఫిల్మ్‌మేక‌ర్స్ ఆమెని తీసుకునేందుకు అంతగా ఆస‌క్తి చూప‌డం లేదు. "ఎఫ్2" వ‌ల్ల ఆమెకి పెద్ద‌గా ఒరిగిందేమీ లేదు.