మ‌ణిర‌త్నంకి మిక్స్‌డ్ రిజ‌ల్ట్‌

Mixed result for Mani Ratnam's Nawab
Wednesday, October 3, 2018 - 22:30

మ‌హా ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం ఈ మ‌ధ్య కాలంలో తీసిన బెట‌ర్ సినిమాల్లో ఇదొక‌టి అని పేరు తెచ్చుకొంది "న‌వాబ్‌". ఐతే ఆయ‌న హార్డ్‌కోర్ అభిమానులు మాత్రం మ‌ణిర‌త్నం గొప్ప‌గా తీయ‌లేద‌ని పెద‌వి విరిచారు. ఆ క్రిటిక్స్ మాట ఎలా ఉన్నా సాధార‌ణ జ‌నానికి బాగానే న‌చ్చిన‌ట్లు క‌న‌పిస్తోంది. ఐతే ఈ న‌చ్చ‌డం అనేది కలెక్ష‌న్ల రూపంలోకి ట్రాన్స్‌ఫ‌ర్ కాలేదు. న‌వాబు తెలుగులో ఫ్లాప్ అయింది. క‌లెక్ష‌న్ల‌లో పురోగ‌తి పెద్ద‌గా లేదు. 

సినిమాపై మొద‌ట్నుంచి పెద్ద‌గా ప్ర‌చారం లేక‌పోవ‌డం, కొన్న నిర్మాత‌లు చివ‌రి నిమిషంలో రంగంలోకి దిగ‌డంతో వారికి స‌మ‌యం సరిపోలేదు. తెలుగులో టాక్ వ‌చ్చినా.. క‌లెక్ష‌న్లు రాక‌పోవ‌డం విషాదం. మ‌రోవైపు, త‌మిళ వెర్స‌న్‌కి వ‌చ్చిన కలెక్ష‌న్లతో మ‌ణిర‌త్నం హ్యాపీ. ఆయ‌న త‌దుప‌రి చిత్రానికి మంచి డిమాండ్ ఉండ‌డం గ్యారెంటీ. 

"న‌వాబు" సినిమాని పాత కాలం గాఢ్‌ఫాద‌ర్‌, ఒక కొరియ‌న్ సినిమాని మిక్స్ చేసి తీశాడ‌ని కామెంట్స్ వ‌స్తున్నాయి. ప్రేర‌ణ ఏదైన‌ప్ప‌టికీ....సినిమాని ఆస‌క్తిక‌రంగా మలిచాడ‌ట‌. ఈ సినిమాతో మ‌రో విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకుందానుకున్నాడు అర‌వింద్ స్వామి. ఆల్రెడీ "ధృవ" సినిమాతో తెలుగులో విజ‌యం అందుకున్నాడు అర‌వింద్ స్వామి. కానీ స‌రైన ప్ర‌మోష‌న్ లేక‌పోవ‌డం అత‌నికి మైన‌స్‌గా మారింది.