అబ్బే అవి రూమ‌ర్లే, మ‌ళ్లీ మోహ‌న్‌బాబు మాట‌

Mohan Babu denies rumors of FDC president
Thursday, July 4, 2019 - 15:30

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిగా వైఎస్‌జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి బాధ్య‌తలు చేపట్టిన  ...సీనియ‌ర్ న‌టుడు మోహ‌న్‌బాబుకి ఏదో ఒక కీల‌క ప‌ద‌వి ఖాయ‌మ‌న్న ఊహాగానాలు మొద‌ల‌య్యాయి. మోహ‌న్‌బాబు కొడుకు విష్ణు.... వైఎస్‌జ‌గ‌న్ సోద‌రిని (క‌జిన్‌) పెళ్లాడాడు.  గ‌త ఎన్నికల సంద‌ర్బంగా మోహ‌న్‌బాబు వైఎస్సార్సీ పార్టీలో చేరి ప్రచారం చేయ‌డం కూడా చేశారు. ఆ బంధుత్వంతో పాటు ఈ లింక్ కార‌ణంగా మోహ‌న్‌బాబుకి మంచి ప‌ద‌వి ఖాయ‌మ‌ని అంతా ఊహిస్తున్నారు.

ఆ మ‌ధ్య తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ఛైర్మ‌న్ ప‌ద‌వి ఖాయ‌మ‌ని అన్నారు. ఐతే జ‌గ‌న్ సీరియ‌స్ కాక‌ముందే మోహ‌న్‌బాబు టీమ్ ఆ వార్త‌ల‌ను తోసిపుచ్చింది. టీటీడీ ఛైర్మ‌న్ ప‌ద‌వి అనేది రూమ‌ర్ అని తేల్చిచెప్పింది. ఆ ప‌ద‌విని త‌న బంధువు వైవి సుబ్బారెడ్డిని టీటీడీ చైర్‌ప‌ర్స‌న్‌గా నియ‌మించారు సీఎం జ‌గ‌న్‌.

తాజాగా మోహన్‌ బాబుకి ఎఫ్‌డీసీ (ఫిలిం డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌) చైర్మన్ ప‌ద‌వి క‌ట్ట‌బెడుతున్నార‌ని ప్ర‌చారం మొద‌లైంది. ఇది సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యింది. దాంతో మోహన్‌బాబు టీం వెంట‌నే రెస్పాండ్ అయింది. .ఆ వార్తల్లో నిజం లేదని చెప్పింది టీమ్‌.

ఇంత‌కీ ఆయ‌న ఆశిస్తున్న ప‌ద‌వి ఏంటో, జ‌గ‌న్ ఇవ్వాల‌నుకుంటున్న‌ది ఏంటో?