న‌న్ను బెదిరిస్తున్నారు: మోహ‌న్‌బాబు

Mohan Babu getting threatening calls?
Wednesday, April 3, 2019 - 19:15

న‌టుడు మోహ‌న్‌బాబు అంటే అంద‌రికీ హ‌డ‌ల్‌. మోహ‌న్‌బాబుకి వ్య‌తిరేకంగా ఒక్క మాట మాట్లాడేందుకు కూడా ఇండ‌స్ట్రీ జ‌నం జంకుతారు. కావాలంటే సాక్షి శివానంద్‌ని, జ‌యంతిని అడ‌గండి. అంత‌టి డేరింగ్ వ్య‌క్తిగా పేరు గ‌డించిన మోహ‌న్‌బాబుని ఎవ‌రైనా బెదిరించ‌గ‌ల‌రా. కానీ త‌న‌కి బెదిరింపు కాల్స్ వ‌స్తున్నాయి అని మోహ‌న్‌బాబు పోలీసుల‌కి ఫిర్యాదు చేశారు. ఇది పూర్తిగా యాంటీ క్ల‌యిమాక్స్‌. అంటే ఊహంచ‌ని ట్విస్ట్‌.

మోహ‌న్‌బాబే త‌న‌కి బెద‌రింపు కాల్స్ వ‌స్తున్నాయి అని అంటే దాల్ మే కుచ్ కాలా అని అనుకోవ‌డం త‌ప్ప మ‌రేమీ చేయ‌లేం. ద‌ర్శ‌కుడు వైవిఎస్ చౌద‌రి వేసిన చెక్ బౌన్స్ కేసులో మోహ‌న్‌బాబుకి వ్య‌తిరేకంగా తీర్పు వ‌చ్చింది. 30 రోజుల్లో 40 ల‌క్ష‌ల‌ను వైవిఎస్‌కి తిరిగి చెల్లించాల‌ని లేక‌పోతే ఏడాది జైలుశిక్ష త‌ప్ప‌ద‌ని కోర్టు చెప్పింది. ఆ త‌ర్వాత జ‌రిగిన పరిణామాల నేప‌థ్యంలో మోహ‌న్‌బాబు త‌న‌కి బెదిరింపు కాల్స్ వ‌స్తున్నాయ‌ని ఈ రోజు బంజ‌రాహిల్స్ పోలీసు స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు.