ఆర్‌.ఆర్‌.ఆర్‌ ఫస్ట్‌లుక్‌పై రూమర్‌

More rumors about RRR
Saturday, August 24, 2019 - 20:30

రాజమౌళి తీస్తున్న ఆర్‌.ఆర్‌.ఆర్‌ సినిమా ఫస్ట్‌లుక్‌ ఎపుడు వస్తుంది? ఈ విషయంలో ఇంతవరకు క్లారిటీ లేదు. ఆర్‌.ఆర్‌.ఆర్‌ అనే సినిమా పూర్తి టైటిల్‌ ఏంటనేది కూడా ఇంత వరకు బయటపెట్టలేదు. ఐతే రఘుపతి రాఘవ రాజారాం అనేది పూర్తి పేరు అని ఊహాగానం ఐతే ఉంది. మొన్న పంద్రాగస్ట్‌ నాడు ఎన్టీఆర్‌ లుక్‌ని రిలీజ్‌ చేస్తారనే పుకారు బయటికి వచ్చింది. ఇపుడు మరో రూమర్‌ రూల్‌ అవుతోంది. అదేంటంటే... కొమరం భీమ్‌ జయంతి అక్టోబర్‌ నెలలో ఉంది. ఆయన జయంతి నాడు ఎన్టీఆర్‌ ఫస్ట్‌లుక్‌ని రిలీజ్‌ చేస్తారనేది ఈ అప్‌డేట్‌.

ఐతే రాజమౌళి మాత్రం ఇపుడు సినిమా ప్రమోషన్, ఫస్ట్‌లుక్‌ల గురించి ఆలోచించడం లేదు. సినిమా షూటింగ్‌ షెడ్యూల్స్‌ ఇప్పటికే తారు మారు అయ్యాయి. సినిమాని జులై 30 2020న విడుదల చేయాలనేది ప్లాన్‌. ఆ రిలీజ్‌ డేట్‌కి రావాలంటే...షూటింగ్‌ స్పీడ్‌ పెంచాలి. జనవరి, ఫిబ్రవరి నాటికి సినిమా షూటింగ్‌ మొత్తం పూర్తి చేసి..గ్రాఫిక్స్‌, పోస్ట్‌ప్రొడక్షన్‌ టీమ్‌కి సినిమాని అందిస్తే తప్ప విడుదల తేదీని అందుకుంటారు. అందుకే ఈ టైమ్‌లో ఫస్ట్‌లుక్‌ హడావుడి గురించి జక్కన్న పట్టించుకోవడం లేదు.

ఇక ఎన్టీఆర్‌పై కొన్ని సీన్లు తీసేందుకు ఆర్‌.ఆర్‌.ఆర్‌ టీమ్‌ తాజాగా బల్గేరియా బయలుదేరి వెళ్లింది.