అఖిల్ సినిమాను కొనండి ప్లీజ్!

Mr Majnu demanding high price for satellite rights
Thursday, November 8, 2018 - 10:45

మొదటి సినిమా డిజాస్టర్. రెండో సినిమా ఫ్లాప్. ఆటోమేటిగ్గా మూడో సినిమాకు మార్కెట్ పడిపోతుంది. ఆ విషయం మొట్టమొదట శాటిలైట్ రైట్స్ విషయంలోనే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే, ప్రస్తుతం థియేట్రికల్ రైట్స్ కంటే ముందు శాటిలైట్ డీల్ పూర్తి చేస్తున్నారు. సరిగ్గా అఖిల్ మార్కెట్ ఇక్కడే బయటపడింది.

వరుస ఫ్లాపులో సతమతమవుతున్న ఈ హీరో తన మూడో ప్రయత్నంగా మిస్టర్ మజ్ను అనే సినిమా చేస్తున్నాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను కొనేందుకు ఏ టీవీ ఛానెల్ ముందుకురావడం లేదు. దీంతో శాటిలైట్ డీల్ తో బోణీకొడదామనుకున్న యూనిట్ కు చుక్కెదురైంది.

ప్రస్తుతానికైతే రెండు ప్రముఖ ఛానెల్స్ తో నిర్మాతలు సంప్రదింపులు జరుపుతున్నారు. నిర్మాతలు కోట్ చేస్తున్న మొత్తానికి, ఛానెల్స్ చెబుతున్న ఎమౌంట్ కు మధ్య భారీ వ్యత్యాసం ఉండడంతో డీల్ తెగేలా కనిపించడం లేదు. మరో వారం రోజుల్లో "మిస్టర్ మజ్ను" శాటిలైట్ రైట్స్ పై ఓ స్పష్టత రాబోతోంది. జనవరి ఆఖరి వారంలో ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు.