సాహో కొత్త పోస్ట‌ర్‌లోనూ వాళ్లు మిస్సింగే

Music directors' names are missing in brand naw poster of Saaho
Tuesday, July 23, 2019 - 15:30

"సాహో" సినిమాకి కొత్త విడుద‌ల తేదీ ఫిక్స్ అయింది. ఈ సారి డేట్ ఛేంజ్ అనేది లేదు. ప‌క్కాగా ఆగ‌స్ట్ 30నే రాక‌. ఎవ‌రికైనా డౌట్స్ ఉంటే అవి చెరిపేసుకోండ‌ని చెప్ప‌డానికే కాబోలు తాజాగా మ‌రో కొత్త పోస్ట‌ర్‌ని రిలీజ్ చేశారు. "ఏ చోట నువ్వున్నా..."అనే పాట‌లోని స్టిల్ ఇది. బాలీవుడ్ సింగ‌ర్ తుల‌సీకుమార్ ఈ పాట‌ని పాడింది. త్వ‌ర‌లోనే ఆ పాట కూడా విడుద‌ల కానుంది.

మొద‌టి పాట‌గా "సైకో స‌య్యా"ని విడుద‌ల చేశారు. రెండో పాట‌గా "ఏ చోట నువ్వున్నా "అనేది రానుంది. ఇదంతా బాగానే ఉంది కానీ ఇంత‌కీ ఈ సినిమాకి టోట‌ల్‌గా ఎంత మంది సంగీత ద‌ర్శ‌కులు, వారి పేర్లు ఏంటి. ఈ విష‌యంలో మాత్రం సోహో టీమ్ క్లారిటీ ఇవ్వ‌డం లేదు. తాజాగా రిలీజ్ చేసిన మూవీ పోస్ట‌ర్‌ల‌లోనూ ఏ ఒక్క సంగీత ద‌ర్శ‌కుడి పేరు క‌నిపించ‌లేదు. వారి పేర్లు టోట‌ల్‌గా మిస్సింగ్‌. 

బ్యాగ్రౌండ్ అందిస్తున్న జీబ్రాన్ పేరు కూడా లేదు. సాహో సినిమా... ఒక అడ్వెంచ‌ర్ థ్రిల్ల‌ర్‌. పాట‌ల క‌న్నా ఫైట్ల‌కే ప్రాధాన్యం. పాట‌ల‌ను కేవ‌లం ప్ర‌మోష‌న్ కోసం వాడుతున్నారు. బాలీవుడ్‌లో టిసిరీస్ సంస్థ ఈ సినిమాని విడుద‌ల చేస్తోంది. సో.. ఆ సంస్థ ప్లాన్ ప్ర‌కారం ఒక్కో పాట‌ని ఒక్కో సంగీత ద‌ర్శ‌కుడు కంపోజ్ చేశాడు.