బెంజ్ కార్ కొనుకున్న ఇస్మార్ట్ బ్యూటీ

Nabha Natesh
Monday, October 14, 2019 - 15:45

నభా నటేష్ నక్క తోకని తొక్కింది. ఆమె ఫేట్ మొత్తం మారిపోయింది. ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ ఇప్పుడు చాలా బిజీ ఆర్టిస్ట్. వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. దాంతో ఈ బెంగుళూరు భామ తనకి తాను ట్రీట్ ఇచ్చుకోంది. బెంజ్ 200D మోడల్ కార్ ని కొనుక్కొంది. దాదాపు 40 లక్షల రూపాయల ధర ఉండే ఈ రెడ్ కార్ తో ఆమె ఎంచక్కా ఫోటో షూట్ కూడా చేసింది. ఆలా ఉంది ఆమె ఆనందం. 

ఇస్మార్ట్ శంకర్ కి ముందు 'నన్ను దోచుకుందువటే', 'అదుగో' అనే రెండు సినిమాలు చేసింది. కానీ రెండూ ప్లాప్ అయ్యాయి. కానీ పూరి హీరోయిన్ గా మారి మాస్ ని అట్ట్రాక్ట్ చేసింది. దాంతో ఇప్పుడు రవితేజ సరసన 'డిస్కో రాజా' నటిస్తోంది. రీసెంట్ గా మరో రెండు సినిమాలు సైన్ చేసింది.