అల్లుడికి తండ్రిగా నాగ‌బాబు

Naga Babu as father to Allu Sirish
Saturday, December 15, 2018 - 16:15

అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం "ఏబీసీడీ". సంజీవ్ రెడ్డి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.  మధుర ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై మధుర శ్రీధర్ రెడ్డి, బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్ పై యష్ రంగినేని సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ ఫిబ్రవరి 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

నాగ‌బాబు ఈ సినిమాలో హీరో తండ్రిగా న‌టించ‌నుండ‌డం విశేషం. అల్లు శిరీష్‌.. నాగ‌బాబుకి నిజ‌జీవితంలో అల్లుడు అవుతాడు. తెర‌పై అల్లుడికి తండ్రిగా క‌నిపించ‌నున్నాడు. ఇటీవ‌ల నాగ‌బాబు తండ్రిగా న‌టించిన గీతాగోవిందం, అర‌వింద స‌మేత చిత్రాలు మంచి విజ‌యాలు సాధించాయి. ఆ సెంటిమెంట్ త‌న‌కి వ‌ర్క‌వుట్ అవుతుంద‌ని శిరీష్ భావిస్తున్నాడ‌ట‌.

"నాకు రియల్ లైఫ్ అంకుల్.. ఇప్పుడు రీల్ లైఫ్ ఫాథర్ గా నటిస్తున్నారు. నేను ఈ చిత్ర కథ విన్నప్పుడే తండ్రి పాత్రలో నాగబాబు గారిని తప్ప వేరొకరిని ఊహించుకోలేకపోయాను. అనుకున్నట్టుగానే ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది," అంటున్నాడు శిరీష్‌.