సైరా చూశాను.. జాతీయ అవార్డ్ గ్యారెంటీ

Naga Babu predicts national award for Sye Raa
Monday, August 26, 2019 - 16:00

"అన్నయ్య విషయంలో నాకు ఒకటే అసంతృప్తి. ఇన్ని సినిమాలు చేసినా ఆయనకు ఇంకా జాతీయ అవార్డు రాలేదు. అవార్డు వచ్చే సినిమాలు చాలా చేశారాయన. కానీ ఎందుకో రాలేదు. సైరా సినిమా ఆ లోటు తీరుస్తుందని భావిస్తున్నాను."

సైరాపై నాగబాబు అభిప్రాయమిది. సైరా సినిమా చూశానని, 60 ఏళ్లు దాటినా చిరంజీవిలో ఆ ఫైర్ ఏమాత్రం తగ్గలేదంటున్నారు నాగబాబు. ఇప్పటికీ అన్నయ్యలో అదే కసి, నిబద్ధత కనిపిస్తోందన్నారు. అవార్డు గ్యారెంటీ అంటున్నారు.

"సైరాలో అన్నయ్య ఫైట్స్, పెర్ఫార్మెన్స్ చూస్తే గూస్ బంప్స్ వస్తాయి. అంత బాగుంది సినిమా. సౌండ్ ఎఫెక్ట్స్, కలర్ కరెక్షన్ లేకుండా చూస్తేనే నాకు అంత నచ్చింది. అన్ని పనులు పూర్తయ్యాక సైరా చూస్తే ఇక నేను చెప్పలేను. అంత గొప్పగా ఉంది. ఈ సినిమాతోనైనా చిరంజీవికి నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డు రావాలనేది నా కోరిక."

ఇలా సైరా సినిమాపై ఓ రేంజ్ లో ప్రచారం మొదలుపెట్టారు నాగబాబు. చిరంజీవి కలల ప్రాజెక్టును అందరూ ఆదరించాలని కోరారు. మరో జన్మను తను నమ్మనని, ఒకవేళ పునర్జన్మ ఉంటే తను చిరంజీవికి తమ్ముడిగానే పుట్టాలని కోరుకుంటానని అన్నారు నాగబాబు.