మాది నైతిక విజ‌యం: నాగ‌బాబు

Naga Babu says Jana Sena won moral victory
Saturday, May 25, 2019 - 12:45

జ‌ర్న‌లిస్ట్ స‌ర్కిల్లో ఒక జోక్ ఉంది. వ‌రుస‌గా ఓడిపోతున్న పార్టీ అభ్య‌ర్థులు నైతిక విజ‌యం మాదే అంటారనేది జోక్‌. అంటే గెలిచిన పార్టీ డ‌బ్బు పంచో, అక్ర‌మాలో చేసి గెలిచింద‌ని, కానీ తాము అవి చేయ‌క ఓడిపోయామ‌ని త‌ప్పించుకోవ‌డానికి ఒక సాకు చెపుతార‌ని పొలిటిక‌ల్ జ‌ర్నలిస్ట్‌లు అంటారు. ఆ సాకే...నైతిక విజ‌యం మాదే.

ప్ర‌స్తుతం నాగ‌బాబు చెపుతున్న మాట ఇదే. జ‌న‌సేన ఎందుకు ఓడింద‌య్యా అంటే...తాము క్లీన్ పాలిటిక్స్ చేశామ‌ని అంటున్నారు. డ‌బ్బు పంచ‌లేదట‌. తాము ఓడిపోయిన నైతిక విజ‌యం మాదే అనే మాట కూడా అనేశారు నాగ‌బాబు. ఇంత‌కీ ఎక్క‌డ అన్నారు. నా ఛానెల్ నా ఇష్టం అనే సొంత యూట్యూబ్ చానెల్లో జ‌న‌సైనికుల‌కి సందేశం ఇచ్చారు నాగ‌బాబు. 

" క్లీన్‌ పాలిటిక్స్ ల‌క్ష్యంతో రాజకీయాల్లోకి వ‌చ్చాం. నా సోదరుడు పవన్‌ కల్యాణ్‌ నేతృత్వంలో డబ్బులు పంచకుండా ముందుకు వ‌చ్చాం. మ‌న‌కి ల‌క్ష‌ల్లో ఓట్లు వ‌చ్చాయి. కేవలం పవన్‌పై అభిమానం, ప్రేమతో, మంచి మార్పు తెస్తారన్న నమ్మకంతో ప్రజలు ఓటేశారు. జనసేన ఎన్నికల్లో ఓడిపోయినా.. నైతికంగా మాత్రం విజయం సాధించింది. కచ్చితంగా మంచి మార్పు తీసుకొద్దాం, మ‌న‌ది లాంగ్ ఫైట్..." అంటూ ఆయ‌న చెప్పుకొచ్చారు.