నాగబాబు వదిలారు ఓ కవిత

Naga Babu's satirical poem on NTR Biopic
Friday, January 4, 2019 - 18:45

బాలయ్య కవితా పరంపర గురించి చాలామందికి తెలిసిందే. అరవింద సమేత ఫంక్షన్ లో పూజా హెగ్డేను పొగుడుతూ బాలయ్య ఓ కవిత అందుకుంటే ఆడిటోరియం చప్పట్లో మారుమోగిపోయింది. ఇప్పుడు బాలయ్యకు పోటీగా నాగబాబు కూడా కవితలతో రెడీ అయ్యారు. తమకు కూడా కవితలు వచ్చంటూ ఒకటి వదిలారు. అయితే ఇది బాలయ్యను పొగిడే కవిత కాదు, ఎన్టీఆర్ బయోపిక్ పై సెటైర్లు వేస్తూ రాసిన కవిత.

కట్టుకథలు కొన్ని
కల్పనలు ఇంకొన్ని
చుట్టనేల.. మూట కట్టనేల
నిజం కక్కలేని బయోపిక్కులొద్దయా
విశ్వదాభి రామ
వినరా మామ

ఇలా ఎన్టీఆర్ బయోపిక్ పై ఓ సెటైరిక్ కవిత వదిలారు నాగబాబు. అక్కడితో ఆగకుండా కవిత్వాలు మాకూ వచ్చండోయ్ అంటూ చివర్లో ఓ పంచ్ లైన్ కూడా వదిలారు. సోషల్ మీడియాలో బాలయ్యను టార్గెట్ చేస్తూ ఎప్పటికప్పుడు పోస్టులు పెడుతున్నారు నాగబాబు. ఆ పరంపరలో భాగంగా ఇది కూడా వచ్చింది.