నాతో ఇంత పెద్ద సినిమానా?: నాగ చైత‌న్య‌

Naga Chaitanya admits he didn't expect Savyasachi would be made this big
Wednesday, October 24, 2018 - 22:30

అక్కినేని యువ స‌మ్రాట్ నాగ్ చైత‌న్య‌కి త‌న గురించి, త‌న మార్కెట్ గురించి పూర్తి అవ‌గ‌హ‌న ఉన్న‌ట్లుంది. త‌న‌తో భారీ సినిమాలు తీసేందుకు నిర్మాత‌లు ముందుకురారు అని చైత‌న్య‌కి తెలుసు. అందుకే, "స‌వ్య‌సాచి" సినిమా విష‌యంలో చై స‌ర్‌ప్రైజ్ అయ్యాడు. "మైత్రీ సంస్థ కాబ‌ట్టే ఇంత భారీగా తీయ‌గ‌లిగింది. మాధ‌వ‌న్‌, భూమిక‌, కీర‌వాణి.. ఇలా భారీ ప్యాడింగ్ తోడు అయిందంటే కార‌ణం ఆ సంస్థే," అని చెప్పుకొచ్చాడు నాగ చైత‌న్య‌.

చైత‌న్య ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన ఒక్క యాక్ష‌న్ చిత్రం కూడా బాక్సాఫీస్ వ‌ద్ద విజ‌యం సాధించ‌లేదు. అత‌నికి వ‌చ్చిన హిట్స్ అన్ని ల‌వ్‌స్టోరీల‌తోనే. ఐతే ఈ సారి మాత్రం ట్రెండ్ రివ‌ర్స్ అవుతుంద‌ని కాన్పిడెంట్‌గా ఉన్నాడు. "ప్రేమం" సినిమా షూటింగ్ టైమ్‌లోనే ద‌ర్శ‌కుడు చందు మొండేటీ "స‌వ్య‌సాచి" క‌థ చెప్పాడ‌ట‌. ఐతే అది త‌న‌కోసం కాదు ఒక పెద్ద హీరో కోసం అనుకున్నానని అన్నాడు చైత‌న్య‌. స‌ర్‌ప్రైజింగ్‌గా చందూ మ‌ళ్లీ నాతోనే ఈ క‌థ చేశాడు. ఈ క‌థ‌కి చాలా పెద్ద స్పాన్ ఉంది. అందుకే మైత్రీ సంస్థ భారీగా తీసింద‌ని చెప్పాడు చైత‌న్య‌. 

నాగ చైత‌న్య ఈ సినిమాలో వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్‌తో పుట్టిన యువ‌కుడిగా న‌టిస్తున్నాడు. అంటే ఇందులో అత‌ని ఒక చేతి అత‌ని మాట విన‌దు. దానికి ప్ర‌త్యేక‌మైన ప‌వ‌ర్ ఉంటుంది. అదెలా సాధ్యమనేది సినిమా చూస్తేనే తెలుస్తుంది. మ‌రి ఈ సారి అయినా చైత‌న్య యాక్ష‌న్ క‌థ‌తో విజ‌యం అందుకుంటాడా అనేది చూడాలి. న‌వంబ‌ర్ 2న విడుద‌ల కానుంది.