ఒకే సినిమాలో నాగశౌర్య 7 గెటప్స్

Naga Shaurya to don 7 getups
Tuesday, July 9, 2019 - 19:45

అసలే సాఫ్ట్ గా కనిపిస్తాడు. అలాంటి హీరోతో 7 గెటప్స్ ఏంటని ఆశ్చర్యపోతున్నారా. కాస్త ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ అది నిజం. తన నెక్ట్స్ సినిమాలో నాగశౌర్య ఏకంగా 7 గెటప్స్ లో కనిపించబోతున్నాడు. ఆ వివరాల్ని స్వయంగా అతడే బయటపెట్టాడు. అతడి మాటల్లోనే..

"ప్రస్తుతం అశ్వద్ధామ అనే సినిమా చేస్తున్నాను. దీంతో పాటు అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా కూడా నడుస్తోంది. దీనికి ఫలానా అబ్బాయి-ఫలానా అమ్మాయి అనే పేరుపెట్టారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే 2 షెడ్యూల్స్ కంప్లీట్ అయ్యాయి. ఇందులో నేను ఏకంగా 7 గెటప్స్ లో కనిపించబోతున్నాను."

అవసరాల, నాగశౌర్య కాంబోలో గతంలో ఊహలు గుసగుసలాడే అనే సినిమా వచ్చింది. ఎంతోమంది హాట్ ఫేవరెట్ ఆ సినిమా. ఇప్పటికీ ఆ సినిమా వస్తే టీవీలకు అతుక్కుపోయేవారు చాలామంది ఉన్నారు. అలాంటి కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా ఇది. 

ఈ మూవీలో నాగశౌర్యతో ఏకంగా 7 గెటప్స్ వేయిస్తున్నాడు అవసరాల శ్రీనివాస్. అయితే ఆ గెటప్స్ ఎందుకోసం.. సినిమా జానర్ ఏంటనే విషయాల్ని మాత్రం శౌర్య బయటపెట్టలేదు. గెటప్స్ కారణంగా అవసరాల సినిమా కాస్త ఆలస్యంగా థియేటర్లలోకి వచ్చే ఛాన్స్ ఉందని మాత్రం స్పష్టంచేశాడు.