నాగ శౌర్యది ధీమానా? ఓవ‌ర్ కాన్పిడెన్సా?

Naga Shourya is commenting about other stars
Sunday, August 26, 2018 - 23:45

ఒక్క హిట్‌తో నాగ‌శౌర్య‌లో చాలా కాన్ఫిడెన్స్ పెరిగింది. చాలా కాలంగా న‌టిస్తున్నా..హీరోగా పాపులారిటీ పెర‌గ‌డం లేద‌ని గ్ర‌హించిన నాగ‌శౌర్య "ఛ‌లో" సినిమాని సొంతంగా నిర్మించుకున్నాడు. ఆ సినిమా కామెడీ కారణంగా మంచి విజ‌యం సాధించింది. "ఛ‌లో" ఇచ్చిన బూస్ట‌ప్‌తో "న‌ర్త‌న‌శాల" అనే మ‌రో సినిమాని నిర్మించాడు. ఇది కూడా ఎంట‌ర్‌టెయిన్‌మెంట్‌తో కూడిన మూవీనే. ఐతే ఈ సినిమాపై ధీమా క‌న్నా ఓవ‌ర్ కాన్ఫిడెన్స్ క‌నిపిస్తోంద‌నే కామెంట్స్ వ‌స్తున్నాయి.

నా సినిమా న‌చ్చితేనే చూడండి లేక‌పోతే చూడొద్దు అని అంటున్నాడు. సినిమా న‌చ్చ‌క‌పోతే ఎలాగూ చూడ‌రు. కొత్త‌గా నాగ‌శౌర్య ప్రేక్ష‌కుల‌కి చెప్పాల్సిన ప‌ని లేదు క‌దా. నా సినిమా మీకు త‌ప్ప‌కుండా న‌చ్చుతుంద‌ని అంటే దాన్ని ధీమా అంటారు. నా సినిమా న‌చ్చ‌క‌పోతే చూడొద్దు అన‌డాన్ని ఏమంటారు?త‌న సినిమాల గురించి ఏమి మాట్లాడుకున్నా ఫ‌ర్వాలేదు కానీ సాటి హీరోల గురించి, త‌నతో న‌టించిన హీరోయిన్ల గురించి బ్యాడ్‌గా, త‌క్కువ చేసి మాట్లాడ‌డం మాత్రం మంచిది కాదు.

ఇంత‌కుముందు సాయిప‌ల్ల‌వి గురించి బ్యాడ్‌గా మాట్లాడిన హీరో ఇత‌నే. ఇపుడు విజ‌య్ దేవ‌ర‌కొండకి వ‌చ్చిన క్రేజ్‌కి పెద్ద విలువ లేదు, అది ఫ్లూక్ అన్న‌ట్లుగా మాట్లాడ‌డం మాత్రం ..ఓవ‌ర్‌గా చేస్తున్న‌ట్లుగానే క‌నిపిస్తోంద‌ని విమ‌ర్శ‌లు మొద‌ల‌య్యాయి. విజ‌య్ దేవ‌ర‌కొండ‌కి స్టార్‌డ‌మ్ పెరిగింది క‌దా అన్న మాట ప్ర‌స్తావ‌న వ‌స్తే ఒక ఇంట‌ర్వ్వూలో ఇలా స్పందించాడు. "రామ్‌చ‌ర‌ణ్ త‌ర్వాత ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన ఏ హీరోకి స్టార్‌డ‌మ్ లేదు. చ‌ర‌ణ్‌, చ‌ర‌ణ్‌కి ముందు వ‌చ్చిన హీరోల‌కే స్టార్‌డ‌మ్ వుంది. ఇపుడు కొత్త‌గా వ‌చ్చిన వారిలో ఎవ‌రూ స్టార్స్ లేరు. ఐనా క్రేజ్‌దేముంది. త‌రుణ్‌కి మించిన క్రేజా ఇది ... " ఇలా మ‌ట్లాడాడు. 

నాగ‌శౌర్య‌కి ఇంకో హిట్ వ‌స్తే త‌ట్టుకోవ‌డం క‌ష్ట‌మే అని కామెంట్లు కూడా వ‌స్తున్నాయి.