మహేష్ హీరోయిన్ కు నమ్రత పరామర్శ

Namratha meets Sonalil in Newyork
Wednesday, October 31, 2018 - 15:15

సోనాలీ బింద్రే ప్రస్తుతం  న్యూయార్క్ లో క్యాన్స‌ర్ వ్యాధికి ట్రీట్ మెంట్ తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు బాలీవుడ్ ప్రముఖులు న్యూయార్క్ వెళ్లి సోనాలిని కలిసి వచ్చారు. రీసెంట్ గా మహేష్ భార్య నమ్రత కూడా సోనాలినీ పరామర్శించింది.

మహర్షి షూటింగ్ కోసం అమెరికా వెళ్లిన మహేష్, షెడ్యూల్ కంటే కాస్త ముందే కుటుంబంతో కలిసి అక్కడ ల్యాండ్ అయ్యాడు. భార్య నమ్రత, కొడుకు గౌతమ్, కూతురు సితారతో కొన్ని రోజులు అమెరికాలో ఎంజాయ్ చేసిన తర్వాత మహర్షి సినిమా సెట్స్ పైకి వెళ్లాడు. అదే టైమ్ లో ప్రత్యేకంగా సోనాలిని కలిసింది నమ్రత.

"ఆమె చాలా ధైర్యవంతురాలు. చాలా ఫిట్ గా కూడా ఉంది. త్వరలోనే సాధారణ జీవితంలోకి సోనాలి వచ్చేస్తుంది. సోనాలితో సమయం ఇట్టే గడిచిపోయింది. చాలా విషయాలు మాట్లాడుకున్నాం. తన అనారోగ్యానికి సంబంధించిన మొత్తం కథను సోనాలీ నాకు వివరించింది. సోనాలి త్వరగా కోలుకోవాలని నేను ప్రార్థిస్తాను."

సోనాలినీ పరామర్శించిన తర్వాత నమ్రత రియాక్షన్ ఇది. గతంలో మహేష్ నటించిన మురారి సినిమాలో సోనాలీ బింద్రే హీరోయిన్ గా నటించింది. తెలుగులో ఆమె మన్మధుడు, ఇంద్ర లాంటి సినిమాల్లో నటించింది.