అదే హ‌రికృష్ణ చివ‌రి కోరిక‌!

Nandamuri Harikrishna's last wish unfulfilled
Thursday, August 30, 2018 - 17:45

నందమూరి హరికృష్ణకిఅశ్రున‌య‌నాల‌తో వీడుకోలు ప‌లికింది అభిమాన గ‌ణం.. తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ఆయ‌న అంతిమ సంస్కారాలు జ‌రిగాయి. హరికృష్ణ చితికి రెండో కుమారుడు కల్యాణ్‌రామ్‌ నిప్పంటించారు. ఏపీ సీఎం చంద్రబాబు, జయకృష్ణ, బాలకృష్ణ, సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌తో పాటు ప‌లువు సినీ రాజకీయ ప్రముఖులు, నంద‌మూరి అభిమానులు అంతిమ యాత్ర‌లో పాల్గొన్నారు.

హ‌రికృష్ణ‌కి ఒక కోరిక ఉండేద‌ట‌. త‌న కుమారులిద్ద‌రితో క‌లిసి న‌టించాల‌నేది ఆయ‌న డ్రీమ్‌. జూనియ‌ర్ ఎన్టీఆర్‌, క‌ల్యాణ్‌రామ్‌ల‌తో ఒక సినిమా చేయాల‌నుకున్నారు హ‌రికృష్ణ‌. ఆయ‌న మ‌న‌సు తెలుసుకున్న క‌ల్యాణ్‌రామ్ రీసెంట్‌గా ఆ ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టారు.

ప‌వ‌న్ సాధినేని ద‌ర్శ‌క‌త్వంలో క‌ల్యాణ్‌రామ్ త్వ‌ర‌లోనే ఒక సినిమా చేయ‌నున్నాడు. ఆ సినిమాలో ఒక పాత్ర‌ని హ‌రికృష్ణ‌తో చేయించాల‌నుకున్నారట‌. అలాగే చిన్న గెస్ట్ రోల్‌లో జూనియ‌ర్ ఎన్టీఆర్‌ని చూపించాల‌నుకున్నారు. అంతా సెట్ అవుతుండ‌గానే రోడ్డు ప్ర‌మాదం హ‌రికృష్ణ‌ని బ‌లిగొన్న‌ది.

ఇద్ద‌రు కుమారుల‌తో సినిమా చేయాల‌నేది హ‌రికృష్ణ చివ‌రి కోరిక‌. అది నెర‌వేర‌కుండానే ఆయ‌న క‌న్నుమూశారు.