రాజేంద్రుడు ఇబ్బంది పెట్ట‌లేద‌ట‌

Nandini and Samantha talk about Rajendra Prasad's over action
Wednesday, June 26, 2019 - 10:45

"ఓ బేబీ" సినిమా షూటింగ్ టైమ్‌లో సీనియ‌ర్ న‌టుడు రాజేంద్ర‌ప్రసాద్ ద‌ర్శ‌కురాలు నందిని రెడ్డికి, హీరోయిన్ స‌మంత‌ని త‌న ఓవ‌ర్‌యాక్ష‌న్‌తో చాలా ఇబ్బంది పెట్టాడ‌ని రూమ‌ర్స్ వ‌చ్చాయి. కొన్ని పత్రిక‌ల్లో క‌థనాలు కూడా వ‌చ్చాయి. ఐతే అవ‌న్నీ త‌ప్పు అన్న‌ట్లుగా మాట్లాడారు నందిని, స‌మంత‌.

రాజేంద్ర‌ప్ర‌సాద్ త‌న‌కి సంబంధం లేకుండా స‌మంత‌కి సంబంధించిన సీన్ల‌లో కూడా దూరిపోయి.... ఎలా ఎక్స్‌ప్రెష‌న్స్ ఇవ్వాలో చెప్పే ప్ర‌య‌త్నం చేశాడ‌ట‌. ద‌ర్శ‌కురాలి ప‌ని అత‌నే చేయడంతో ఒక ద‌శ‌లో స‌మంత‌, నందిని ఇద్ద‌రూ అత‌నిపై అరిచార‌నేది రూమ‌ర్‌. ఐతే, నందిని, స‌మంత మాత్రం ఇపుడు ఈ సినిమా ప్ర‌మోష‌న్ ఇంట‌ర్వ్యూల‌లో రాజేంద్ర‌ప్ర‌సాద్‌ని పొగిడేస్తున్నారు.

రాజేంద్రుడు ఇబ్బంది పెట్ట‌లేద‌ని చెప్ప‌డం లేదు కానీ ఆయ‌న న‌ట‌న గురించి మాత్రం తెగ చెపుతున్నారు. ఇది తెలివైన ప‌ద్ద‌తి క‌దా. ఈ సినిమాలో రాజేంద్ర‌ప్ర‌సాద్‌ది చాలా కీల‌క‌మైన పాత్ర‌. బేబీకి ఫ్రెండ్‌గా న‌టించాడు.