నందిత ఇంత బిజినా?

Nanditha Swetha turns busy
Thursday, May 23, 2019 (All day)

నందిత శ్వేత‌కి హిట్స్ త‌క్కువ‌, ఆఫ‌ర్లు ఎక్కువ అన్న‌ట్లుగా ఉంది సీన్‌. నందిత "ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా" సినిమాతో గుర్తింపు తెచ్చుకొంది. అందులో రెండో హీరోయిన్‌గా న‌టించింది. ఆ త‌ర్వాత నితిన్ న‌టించిన "శ్రీనివాస క‌ల్యాణం", "ప్రేమ‌క‌థా చిత్రం 2", "బ్ల‌ఫ్ మాస్ట‌ర్" సినిమాల్లో క‌నిపించింది. మూడు సినిమాలు అట్ట‌ర్ ఫ్లాప్ అయ్యాయి. 

మూడు పోయినా కూడా ఆమెకి అవ‌కాశాలు త‌గ్గ‌లేదు. పైగా మ‌రిన్ని సినిమాల్లో అవ‌కాశాలు వ‌స్తున్నాయి. ఏంటో ఆ మిస్ట‌రీ?

త్వ‌ర‌లోనే ఆమె "అభినేత్రి 2"లో క‌నిపించ‌నుంది. త‌మ‌న్న‌, ప్ర‌భుదేవాల‌తో పాటు ఈ భామ కూడా న‌టించింది ఇందులో. వ‌చ్చేనెల‌లో "సెవ‌న్" అనే మ‌రో మూవీ కూడా విడుద‌ల కానుంది. అందులో ఏడుగురు భామ‌ల్లో ఒక‌రిగా క‌నిపించ‌నుంది. అలాగే రాజ‌శేఖ‌ర్ న‌టిస్తున్న "క‌ల్కి"లోనూ, "అక్ష‌ర" అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీలోనూ క‌నిపించ‌నుంది. ప్ర‌స్తుతం రిలీజ్‌కి రెడీగా మూడు సినిమాలున్నాయి. ఇంత బిజీగా ఉంది ఈ బ్యూటీ.