నాని, రాజ్ తరుణ్ మల్టీస్టారర్

Nani and Raj Tarun multistarrer
Sunday, February 24, 2019 - 15:00

చాన్నాళ్ల కిందటే ఓ మల్టీస్టారర్ కథ రాసుకున్నాడు దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ. దిల్ రాజు బ్యానర్‌పై ఆ సినిమా చేయాలనేది ఒప్పందం. అంతా ఓకే అయింది. కథ సెట్ అయింది. నానితో పాటు దుల్క‌ర్ స‌ల్మాన్ కావాల‌ని అనుకున్నారు. దుల్క‌ర్ డేట్స్ లేవ‌ని చెప్పాడు. ఆ త‌ర్వాత మ‌రో పెద్ద హీరో కావాల‌ని ఇంద్ర‌గంటి కోరాడు. కానీ దిల్ రాజు మాత్రం ధైర్యం చేయలేకపోయాడు. ఈమధ్య కాలంలో మీడియం రేంజ్ బడ్జెట్ లో సేఫ్ వెంచర్స్ తీస్తున్న ఈ నిర్మాత.. ఇంద్రగంటి దర్శకత్వంలో మల్టీస్టారర్ చేయడానికి కాస్త వెనకంజ వేశాడు.

ఇన్నాళ్లకు ఈ ప్రాజెక్టులో చలనం వచ్చింది. నాని, రాజ్ తరుణ్ హీరోలుగా ఈ మల్టీస్టారర్ సెట్స్ పైకి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ సినిమాలో నటించడంతో పాటు సహ-నిర్మాతగా కూడా వ్యవహరించడానికి నాని అంగీకరించాడట. ఇతడికి ఆల్రెడీ ఓ బ్యానర్ ఉన్న విషయం తెలిసిందే. ఇక రాజ్ తరుణ్ విషయానికొస్తే, ఈ హీరో వద్ద దిల్ రాజు అడ్వాన్స్ ఆల్రెడీ ఉంది. పైగా తక్కువ బడ్జెట్ లో అయిపోతుంది. 

ఈ సమీకరణాలన్నీ చూసుకున్న తర్వాత దిల్ రాజు కూడా ఈ మల్టీస్టారర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.