కో ప్రొడ్యుస‌ర్‌గా నాని

Nani turns co-producer
Monday, April 15, 2019 - 15:00

నిర్మాతగా మరో సినిమా తీసేందుకు రెడీ అవుతున్నాడు నాని. గతేడాది నాని నిర్మాతగా మారి ఓ చిన్న సినిమా నిర్మించాడు. "అ" అనే పేరుతో విడుదలైన ఆ మూవీ నానికి ప్రొడ్యుసర్‌గా  లాభాలు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత మరో సినిమా తీయలేదు.

నాని ప్రస్తుతం "జెర్సీ" సినిమా ప్రమోషన్స్‌తో  బిజీగా ఉన్నాడు. అలాగే విక్రమ్ కుమార్ డైరక్షన్‌లో "గ్యాంగ్ లీడర్" అనే మూవీలో నటిస్తున్నాడు. ఇక తన గురువు ఇంద్రగంటి తీసే కొత్త సినిమా కూడా త్వరలోనే మొదలు పెట్టనున్నాడు. ఈ సినిమాకి కో ప్రొడ్యుసర్‌గా తన పేరు వేసుకుంటాడట. దిల్ రాజు నిర్మాత కానీ తన బ్యానర్ ని కూడా ఈ సినిమాకి అటాచ్ చేస్తాడని అంటున్నారు.

తన పారితోషికం బదులు ఈ సినిమాలో వాటాని కోరుతున్నాడనేది టాక్. ఎందుకంటే దిల్ రాజు బ్యానర్‌తో తన బ్యానర్ ని కలిపితే.. రిస్క్ తక్కువుంటుంది కదా. ప్రొడక్షన్ అంతా దిల్ రాజు చూసుకుంటాడు.