మాలో తొలి నాడే లుకలుక‌లు

Naresh and Rajasekhar fight in MAA
Saturday, March 23, 2019 (All day)

మా ఎన్నిక‌లు ముగిశాయి కానీ మాలో కొన్నాళ్లూగా సాగుతున్న‌ ప్ర‌హ‌స‌నం మాత్రం ఎండ్ కాలేదు. కొత్త‌గా అధ్య‌క్షుడిగా ఎన్నికైన న‌రేష్ శుక్ర‌వారం (మార్చి 22న‌) ప్రమాణ స్వీకారం చేశారు.  ఈ సందర్భంగా న‌రేష్ నేను ఇది చేస్తా, అది చేస్తా అంటూ స్కోత్క‌ర్ష చెప్పుకున్నాడు. నా, నేను అంటూ మా సంస్థ‌ని సొంత సంస్థ‌గా మార్చేశాడు. ఎక్క‌డా త‌మ బాడీ అని కానీ, గెలిచిన‌వారమంతా క‌లిసి ఇది చేస్తామ‌ని చెప్ప‌లేదు. 

దాంతో హీరో రాజ‌శేఖ‌ర్ మైక్ లాగేసుకున్నాడు. ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్ గా ఎన్నికైన‌ రాజశేఖర్ న‌రేష్ తీరు బాలేద‌ని అసంతృప్తి వ్యక్తం చేశాడు. న‌రేష్ నా అంటూ మాట్లాడ‌డం స‌రైంది కాదు మా అనాలి. మమ్మ‌ల్ని అంద‌ర్నీ క‌లుపుకోవాలి అంటూ రాజ‌శేఖ‌ర్ చెప్పాడు. యాంగ్రీమేన్ ఇలా మాట్లాడ‌డంతో వీరి మ‌ధ్య లుకలుక‌లు బ‌య‌ట‌ప‌డ్డాయి. 

ఐతే వెంటనే మైక్ అందుకున్న జీవిత… రాజ‌శేఖ‌ర్ మాట‌ల ఆంత‌ర్యం వేరే అని చెపుతూ కవర్ చేసే ప్రయత్నం చేశారు. మా మధ్య ఎలాంటి విబేధాలు ఏమీ లేవన్నారు జీవిత‌. ఇది తొలి రోజు జ‌రిగిన ప్ర‌హ‌స‌నం.