న‌రేష్‌కి ఇంకా ద‌క్క‌ని కుర్చీ

Naresh yet to be chaired as president of MAA
Saturday, March 16, 2019 - 19:00

న‌టుడు న‌రేష్ ఇటీవ‌ల జ‌రిగిన మా ఎన్నిక‌ల్లో అధ్య‌క్షుడిగా గెలిచాడు. శివాజీరాజాపై పోటీ చేసి గెలిచాడు. ఐతే న‌రేష్ అధ్య‌క్షుడిగా కుర్చీ ఎక్కేందుకు చాన్స్ లేదు. ఈ నెలాఖ‌రు వ‌ర‌కు త‌న ప‌ద‌వీకాలం ఉంద‌ని ప్ర‌స్తుత అధ్య‌క్షుడు శివాజీరాజా పేచీ పెట్టాడ‌ట‌. అందుకే న‌రేష్‌కి ఇంకా కుర్చీ ద‌క్క‌లేదు.

కోర్టుకు వెళ్తానని శివాజీ రాజా ఫోన్ చేసి బెదిరిస్తున్నారని నరేష్ అంటున్నారు.

"మాలో కొన్ని అవకతవకలు జరిగిన మాట వాస్తవం. అవన్నీ మర్చిపోయి మా గుట్టు బయట పడకుండా అందరినీ కలుపుకొని పోయి పనిచేయాలని నిర్ణయించుకున్నాం. ఈ నెల‌ 22న మంచి ముహూర్తం ఖరారు చేసుకొని ప్రమాణ స్వీకారం చేయాలని నిర్ణయించుకున్నాం.. శివాజీ రాజా నా పదవీకాలం 31 వరకు ఉంది అప్పటి వరకు ఎవరూ మా కుర్చీ లో కూర్చో వద్దు అని చెప్తున్నారు. ఇది కరెక్ట్ కాదు... మేము చేయాల్సిన పనులు చాలా వున్నాయి. పెద్దలు ఎలా చెప్తే అలా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం... "అంటూ న‌రేష్ ఈ రోజు మీడియా ముందుకొచ్చారు. సో.. న‌రేష్ చెయిర్‌లో కూర్చొవాలంటే మ‌రికొంత కాలం ఆగాలి.