ఓ బేబీ వచ్చింది.. నా సినిమా ఆగిపోయింది

Naveen Krishna blames Oh Baby
Friday, October 4, 2019 - 19:00

సమంత లీడ్ రోల్ లో వచ్చింది ఓ బేబీ సినిమా. ఈ సినిమాకు హీరో నవీన్ విజయకృష్ణకు ఎలాంటి సంబంధం లేదు. కానీ కేవలం సమంత సినిమా వల్లనే తన సినిమా ఆగిపోయిందంటున్నాడు నవీన్. దీని వెనక ఓ గమ్మత్తయిన రీజన్ కూడా చెబుతున్నాడు.

"ఆమధ్య విఠలాచార్య అనే సినిమా స్టార్ట్ చేశాను. 5 రోజులు షూటింగ్ కూడా చేశాం. కానీ సమంత నటించిన ఓ బేబీ వల్ల అది ఆగిపోయింది. ఎఁదుకంటే.. మేం చేస్తున్న విఠలాచార్య సినిమా కూడా దాదాపు ఓ బేబీ కథలానే ఉంటుంది. అందుకే షూటింగ్ స్టార్ట్ చేసి మరీ ఆపేశాం."

ఊరంతా అనుకుంటున్నారు సినిమా రిలీజ్ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఇలా ఇంట్రెస్టింగ్ మేటర్ ను బయటపెట్టాడు నవీన్ విజయ్ కృష్ణ. విఠలాచార్య ఆగిపోయినప్పటికీ అది మంచి కథ అని, చిన్నచిన్న మార్పులు చేసి ఎప్పటికైనా ఆ సినిమాను మళ్లీ తెరపైకి తీసుకొస్తామంటున్నాడు నవీన్.

నిజానికి నవీన్ సినిమాలు ఆగిపోవడం ఇదే ఫస్ట్ టైమ్ కాదు. గతంలో కీర్తిసురేష్ హీరోయిన్ గా ఓ సినిమా స్టార్ట్ చేశాడు ఈ హీరో. స్టిల్స్ కూడా రిలీజైన తర్వాత ఆ మూవీ ఆగిపోయింది. ఇప్పుడు 5 రోజుల షూటింగ్ తర్వాత విఠలాచార్య ఆగిపోయింది. ఇకపై తన నుంచి సినిమాలు ఆగిపోకుండా జాగ్రత్తపడతానంటున్నాడు నవీన్ విజయ్ కృష్ణ.