హమ్మయ్య ఆ జంట ఇండియాలోనే ఉంది

Nayan celebrates boyfriend's birthday
Wednesday, September 18, 2019 - 14:30

మూడేళ్ల నుంచి ఒకటే తంతు. ఎవరి పుట్టినరోజు వచ్చినా విదేశాలకు ఎగిరిపోవడం, ఫుల్లుగా ఎంజాయ్ చేసి రావడం, అక్కడ్నుంచే ఓ 2 ఫొటోలు అప్ లోడ్ చేయడం. నయనతార, విఘ్నేష్ శివన్ విషయంలో ఇదంతా రొటీన్ వ్యవహారం. కానీ ఈసారి కాస్త ప్రొగ్రామ్ మారింది. ఓ ఈవెంట్ ను ఇండియాలోనే సెలబ్రేట్ చేసుకుంది ఈ జంట.

ఈరోజు విఘ్నేష్ శివన్ పుట్టినరోజు. గడిచిన రెండేళ్లుగా బాయ్ ఫ్రెండ్ బర్త్ డే ను విదేశాల్లోనే సెలబ్రేట్ చేసింది నయనతార. ఓసారి కాలిఫోర్నియా, ఇంకోసారి ఆస్ట్రేలియా చుట్టొచ్చింది ఈ జంట. ఈసారి మాత్రం విఘ్నేష్ ఇక్కడే ఉన్నాడు. పుట్టినరోజును సింపుల్ గా జరుపుకున్నాడు. ఈసారి వీళ్లు విదేశాలకు వెళ్లకపోవడంతో ఇద్దరి మధ్య ప్రేమ తగ్గిందా అంటూ కొత్త డిస్కషన్ ఊపందుకుంది.

నిజానికి వీళ్లిద్దరి మధ్య ప్రేమ తగ్గలేదు. ఇప్పటికీ నయన్-విఘ్నేష్ పీకల్లోతు ప్రేమలోనే ఉన్నారు. కాకపోతే ఈసారి నయన్ తో పాటు విఘ్నేష్ కూడా కాస్త బిజీ. అందుకే ఫారిన్ టూర్ వద్దన్నాడు. నయన్ కూడా లైట్ తీసుకుంది. అలా చెన్నైకే పరిమితమైంది ఈ జంట. అయితే చెన్నైకే పరిమితమైనప్పటికీ ప్రియుడి కోసం నయన్ చాలా పెద్ద పార్టీ ఎరేంజ్ చేసింది. ఈరాత్రికి ఫుల్ పటాస్.