అమ్మ కానున్న నయ‌న‌తార‌!

Nayanathara to essay Jayalalitha's role
Thursday, October 25, 2018 - 16:45

త‌మిళ‌నాట అమ్మ బ‌యోపిక్‌ల‌కి డిమాండ్ ఎక్కువ‌గా ఉంది. జ‌య‌ల‌లిత బ‌యోపిక్‌ని తీస్తున్నామ‌ని ఇప్ప‌టికే ముగ్గురు ఫిల్మ్‌మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. అందులో ఒక ద‌ర్శ‌క‌రాలు ఇప్ప‌టికే ప్రీప్రొడ‌క్ష‌న్ పనులు షురూ చేసింది. ఇందులో నిత్య‌మీన‌న్ జ‌య‌ల‌లిత‌గా న‌టించ‌నుంద‌ట‌.

ఇక ద‌ర్శ‌కుడు ఎ.ఎల్‌.విజ‌య్ విద్యాబాల‌న్ క‌థానాయిక‌గా జ‌య‌ల‌లిత బ‌యోపిక్‌ని తీసేందుకు రెడీ అవుతున్నాడు. ఎన్టీఆర్ బ‌యోపిక్ నిర్మాత‌ల్లో ఒక‌రైన విష్ణు ఇందూరి ఈ సినిమాని తీయ‌నున్నారు.

ఇపుడు మ‌రో ప్ర‌క‌ట‌న వ‌చ్చింది. లింగుస్వామి ద‌ర్శ‌క‌త్వంలో జ‌య‌ల‌లిత బ‌యోపిక్ తెర‌కెక్క‌నుంద‌ట‌. ఈ ద‌ర్శ‌కుడు న‌య‌న‌తారతో బ‌యోపిక్‌ని ప్లాన్ చేస్తున్నార‌ట‌. అంటే న‌య‌న‌తార మూడో అమ్మ‌. విద్యాబాల‌న్‌, నిత్య మీన‌న్ త‌ర్వాత అమ్మ కానుంది న‌య‌న‌తార‌.