సాహో కోసం వారం ముందుకొచ్చిన అజిత్‌

Nerkonda Paarvai confirms its release date
Monday, July 15, 2019 - 19:00

అజిత్ న‌టించిన కొత్త త‌మిళ చిత్రం..."నేర్‌కొండ పార్‌వాయి". బాలీవుడ్‌లో సూప‌ర్‌హిట్ట‌యిన "పింక్" అనే సినిమాకి రీమేక్‌. బోనీక‌పూర్ త‌మిళంలో నిర్మించిన మూవీ ఇది. ఈ సినిమాని మొద‌ట ఆగ‌స్ట్ 15న విడుద‌ల చేయాల‌నుకున్నారు. కానీ సాహో తెలుగు, త‌మిళ‌, హిందీ, మ‌ల‌యాళ భాష‌ల్లో క‌నీవినీ ఎరుగ‌ని రీతిలో విడుద‌ల కానుంది. ప్ర‌భాస్ మేనియాని త‌ట్టుకోలేమ‌ని అజిత్ త‌న సినిమాని ఒక వారం ముందుకు జ‌ర‌ప‌డం విశేషం.

"నేర్‌కొండ పార్‌వాయి" ఆగ‌స్ట్ 8న విడుద‌ల అవుతుంది. తాజాగా సినిమా డేట్‌ని అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించారు. ఒక‌వేళ సినిమా బాగుంద‌ని టాక్ వ‌స్తే.. ఈ సినిమాకి సాహో వ‌చ్చినా త‌మిళ‌నాట ఢోకా ఉండ‌దు. అందుకే సాహోతో పోటీప‌డ‌డం క‌న్నా ముందే రావ‌డం మంచి నిర్ణ‌య‌మ‌ని అజిత్ భావించాడు. 

ఈ సినిమాలో అజిత్ 50 ఏళ్ల వాడిగా న‌టిస్తున్నాడు. హిందీ క‌థ‌కి, త‌మిళ క‌థ‌కి కొంత మార్పులు చేశార‌ట‌.